close

తాజా వార్తలు

సోనియా ప్రమాణం.. వైకాపా సభ్యుల అభినందన

దిల్లీ: యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకాపా సభ్యులు అభినందనలు తెలిపారు. మంగళవారం లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయడానికి సోనియాగాంధీ తన సీటు నుంచి వెల్‌ వద్దకు వస్తున్న సమయంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్‌ ఎంపీలతోపాటు వైకాపా సభ్యులు రఘురామ కృష్ణంరాజు, తలారి రంగయ్యలు కూడా బల్లలపై చేతులు చరిచి అభినందనలు తెలిపారు. తన మాతృమూర్తి హిందీలో ప్రమాణం చేస్తుండగా రాహుల్‌గాంధీ మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ‘హిందీలో ప్రమాణం చేసినందుకు సోనియాగాంధీకి శుభాకాంక్షలు’ అంటూ భాజపా సభ్యులు కొందరు వ్యాఖ్యానించారు. అనంతరం భాజపా ఎంపీ మేనకాగాంధీ పేరును సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ పిలవడంతో భాజపా సభ్యులు బిగ్గరగా శబ్దం చేస్తూ బల్లలను చరిచారు. ఆమె ప్రమాణం చేసిన అనంతరం తోటి కోడళ్లు ఇద్దరూ ఒకరికొకరు ముకుళిత హస్తాలతో నమస్కరించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వీల్‌ఛైర్‌లో వచ్చిన ఎస్పీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌(79) తన సీటు నుంచే ప్రమాణం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.