close

తాజా వార్తలు

ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియ ముమ్మరం

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్‌ నరసింహన్‌ ఇటీవల జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను అధికారులు తెలంగాణకు అప్పగిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ లోపు భవనాలను పూర్తిస్థాయిలో తెలంగాణకు అప్పగిస్తామంటూ ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం.. తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా భవనాల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మేరకు ఏపీకి చెందిన భవనాల్లోని సామగ్రిని అధికారులు అమరావతికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని భవనాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. సచివాలయంలో ఈ రోజు మరికొన్ని బ్లాక్‌లను అప్పగించే ప్రక్రియ పూర్తవగా.. మిగిలిన మరికొన్ని బ్లాక్‌ల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం భవనాల అప్పగింతపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.