close

తాజా వార్తలు

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైనా గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.