close

తాజా వార్తలు

దుర్గగుడి ఆధ్వర్యంలో వరుణయాగం

విజయవాడ: విరివిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈ నెల 20 నుండి 24 వరకు వరుణ యాగం జరగనుంది. గురువారం నుంచి 22వరకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు దేవస్థానానికి చెందిన వేద విద్యార్థులు, అర్చకులతో పారాయణం నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఉదయం 7 నుంచి 11గంటల వరకు మండప ఆరాధనలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 24న ఉదయం 6గంటల నుంచి 11 వరకు సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని కోటేశ్వరమ్మ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.