
తాజా వార్తలు
న్యూదిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు చెందిన పైలట్లు ఇకపై తమ ఇంటి నుంచి విమానంలోకి ఆహారాన్ని తెచ్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇటీవల ఓ విమానంలో పైలట్‌కు, ఓ క్యాబిన్ సిబ్బందికి జరిగిన తీవ్ర వాగ్వాదమే ఇందుకు కారణం. సోమవారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో ఓ పైలట్ అన్నం తిని అనంతరం తన టిఫిన్‌ను కడగమని క్యాబిన్ సిబ్బందిలో ఒకరికి చెప్పాడు. తానెందుకు కడుగుతానని ఆ సిబ్బంది గొడవ పెట్టుకోవడంతో వివాదం చెలరేగి విమానం రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో పైలట్లు టిఫిన్ బాక్సులు తెచ్చుకోకుండా చేయాలని అధికారులు భావిస్తున్నారు.
‘‘సోమవారం జరిగిన ఘటనను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. విమానంలోకి సొంతంగా ఆహారాన్ని తెచ్చుకోవద్దని మేము పైలట్లకు త్వరలో సూచిస్తాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరో అధికారి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సోమవారం ఉదయం 11.40 గంటలకు AI 772 విమానం బెంగళూరు నుంచి కోల్‌కతాకి వెళ్లాల్సి ఉంది. కానీ, దాదాపు రెండు గంటలు ఆలస్యమైంది. గొడవ పడుతున్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బంది ఇద్దరినీ ఆ విమానంలోంచి దించేసి.. ఇతర పైలట్, సిబ్బందిని ఎక్కించి ఆ విమానం వెళ్లేలా చేశాం’’ అని చెప్పారు. వారి మధ్య జరిగిన గొడవపై దర్యాప్తు ప్రారంభమైందని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, విమాన సిబ్బందికి సంస్థయే ఆహారాన్ని అందిస్తోంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
