close

తాజా వార్తలు

విశాఖలో బంగారం పట్టివేత

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో 1293.85 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి రుసుము చెల్లించకుండా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకు వస్తున్నట్టు గుర్తించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ మీదుగా ఎయిరిండియా విమానంలో విశాఖ చేరుకున్న నలుగురు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఈ బంగారాన్ని హైదరాబాద్‌కు వస్తున్న ముగ్గురికి అప్పగించి, సిబ్బందిని తప్పుదోవ పట్టించే యత్నంచేసినట్టు అధికారులు గుర్తించారు. నిందితులను విచారిస్తున్నామని కస్టమ్స్ ముఖ్య కమిషనర్ డి.కె.శ్రీనివాసన్ వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.