
తాజా వార్తలు
సూర్యాపేట: మునగాల మండల కేంద్రంలో సోమవారం ప్రతి ఇంటా చేపల కూరే. ఆశ్చర్యంగా ఉంది కదూ! మునగాల చెరువులో గుత్తేదారు నల్లపాటి శ్రీనివాస్ చేపలను పట్టారు. వాటిని విక్రయించేందుకు మార్కెట్కు తీసుకెళ్లకుండా గ్రామంలోని రేషన్ కార్డుదారులందరికీ రెండు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో సుమారు 2500 పైచిలుకు కార్డుదారులు ఉన్నారు. ముందుగా కార్డుదారులకు కూపన్ ఇచ్చారు. దాన్ని చూపించిన వారికి చేపలను పంచారు. దాదాపు నాలుగున్నర టన్నుల చేపలను ఇలా పంపిణీ చేశారు. గ్రామస్థులందరికీ ఉచితంగా అందించిన తర్వాతే మిగిలిన చేపలను విక్రయించాలనుకున్నట్లు శ్రీనివాస్ ‘ఈనాడు’తో అన్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
