close

తాజా వార్తలు

చాటంత చెవుల మేక

ఆదోని మార్కెట్‌: మేక చెవులు సాధారణంగా ఐదు నుంచి ఆరు అంగుళాల పొడవుతో ఉంటాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న మేక మాత్రం చాటడంత చెవుల(18 అంగుళాలు)తో అందరినీ ఆకర్షిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పీఎన్‌ రహదారిలో నివసిస్తున్న వ్యాపారి కరీముల్లా ఈ మేకను సాకుతున్నారు. దీనిని మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి జమున అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారు. మూగజీవాల స్నేహం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని కరీముల్లా చెబుతున్నారు. ఇది జమునపురి జాతికి చెందినదని, ఈ తరహా మేకలు దక్షిణాఫ్రికాలో కనిపిస్తాయని ఆదోని పశుసంవర్ధకశాఖ అధికారి ధనుంజయ చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.