close

తాజా వార్తలు

బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమను లైంగికంగా వేధించడంతోపాటు ఆర్థికంగానూ నష్టపరిచారంటూ నటి గాయత్రి గుప్తా, యాంకర్‌ శ్వేతారెడ్డి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3 నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఇప్పటికే బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌-3కి తనను ఎంపిక చేసి అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారంటూ శ్వేతారెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా నటి గాయత్రితో కలిసి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. 
‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 ఈనెల 21 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.