close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. సంకీర్ణ సర్కారుకు గురువారమే బలపరీక్ష!

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకు స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చారు. ఈ నెల 18న (గురువారం) ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 23 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాలు, ఇంధనం, విద్యుత్‌ ధరలు తగ్గడంతో జూన్‌ నెలలో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. క్రితం నెలలో 2.02శాతంగా నమోదైంది. 2017 జులై(1.88శాతం) తర్వాత ఇదే కనిష్ఠం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.45శాతంగా నమోదైంది. 2018 జూన్‌లో ఇది 5.68శాతంగా ఉంది. సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. జూన్‌లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.98శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు తగ్గడంతో ఆ విభాగ ద్రవ్యోల్బణం 24.76శాతానికి పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈనెల 17న తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ మంత్రివర్గం ఈనెల 17న సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్ర 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. నూతన పురపాలక చట్టం బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

4. బుగ్గన గారూ.. ప్రజలు దేన్ని నమ్మాలి?:లోకేశ్‌

‘సీఎం జగన్‌ ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు’ అంటూ తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. వైకాపా నుంచి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని లోకేశ్‌ నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది

దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జ్‌ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో విజయ్‌నగర్‌ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నాంపల్లిలో తెరాస సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని..సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాప్‌ అప్‌ కెమెరాతో రియల్‌మి ఎక్స్‌

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌ మి అవతరించిన నాటి నుంచి అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు మొబైల్‌ ఫోన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మరో ప్రీమియం మొబైల్‌ను విడుదల చేసింది. ‘రియల్‌ ఎక్స్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ పాప్‌ అప్‌ కెమెరాతో పాటు నాచ్‌ లేకుండా ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో వస్తుండటం గమనార్హం. ప్రస్తుతం విపణిలో ఉన్న రెడ్‌మి నోట్‌ 7ప్రో, వీవో జెడ్‌1 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 40, త్వరలో విడుదల కానున్న రెడ్‌మి కె20లకు ఈ ఫోన్‌ పోటీ ఇవ్వనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 5 గ్యాస్‌ సిలిండర్లు పేలి 20 పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని పొగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. 5 గ్యాస్‌ సిలిండర్లు పేలి 20 పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో మంటలు చెలరేగి క్షణాల్లో వీధి మొత్తం వ్యాపించాయి. ఇళ్లల్లో ఉన్న గ్యాస్‌ సిలెండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నాలుగు ఇళ్లల్లో గ్యాస్‌ సిలెండర్లు పేలినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులంతా కట్టుబట్టలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

8. వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్‌ ?

ప్రపంచకప్ నుంచి సెమీస్‌లో భారత్ నిష్క్రమించిన తర్వాత జట్టులోని లోపాలపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాలుగో స్థానంలో బ్యాట్స్‌మన్, రాయుడు రిటైర్మెంట్, మయాంక్ అగర్వాల్ జట్టులో ఎంపికపై అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించినా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదరగొట్టాడు. టోర్నీలోనే అత్యధిక పరుగుల వీరుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే భారత సారథి బాధ్యతలను టెస్టుల్లో, వన్డేల్లో విభజించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థతో పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ఫార్మా, ఐటీ రంగాలకు ప్రపపంచ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉండటంతో సోమవారం ట్రేడింగ్‌లో ఆ షేర్లు బాగా లాభపడ్డాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 38,905 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 11,589 వద్ద ముగిశాయి. చైనా జీడీపీ డేటా మధుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, మారుతీ షేర్లు బాగా లాభపడగా.. ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీరంగ షేర్లు, ఫార్మా రంగ షేర్లు  లభ్దిపొందాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పార్క్‌లో ఒళ్లుగగుర్పొడిచే ప్రమాదం 

 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.