close

తాజా వార్తలు

ఆదాయపన్ను ఎగవేతదారులకు క్షమాభిక్ష పథకం!

ఈనాడు, దిల్లీ: ఆదాయపన్ను వివాదాలు దాదాపు రూ.9 లక్షల కోట్లకు చేరువ కావడంతో, ఈ కేసుల పరిష్కారానికి క్షమాభిక్ష పథకం ప్రవేశపెట్టాలని సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు చేసే అవకాశం ఉంది. ప్రత్యక్ష పన్నుల ఎగవేతకు సంబంధించి 4.65 లక్షల కేసులు వివిధ ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈ కేసుల్లో రూ.8.20 లక్షల కోట్ల సొమ్ము ఇరుక్కుంది. దాదాపు 3-4 నెలల పాటు అమల్లో ఉండే ఈ ‘ఒకసారి క్షమాభిక్ష’ పథకం వల్ల పన్ను కేసుల సంఖ్య చాలావరకు తగ్గే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు భావిస్తున్నారు. 2017 నవంబరులో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌ జులై 31 నాటికి ముసాయిదా నివేదిక సమర్పించాలి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ‘సబ్‌కా విశ్వాస్‌ వారసత్వ వివాద పరిష్కార పథకం-2019’ని ప్రకటించిన తర్వాత కొందరు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు ఈ క్షమాభిక్ష ఆలోచనను ప్రతిపాదించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎక్సైజు, సేవాపన్ను కేసుల్లో వడ్డీ, జరిమానా మాఫీని ‘సబ్‌కా విశ్వాస్‌ వారసత్వ వివాద పరిష్కార పథకం’లో ప్రకటించారు. ఈ పథకం ఉపయోగించుకుంటే పరోక్ష పన్ను ఎగవేతదారులపై విచారణ ఉండదు. ప్రత్యక్ష పన్నుల ఎగవేతదారులకూ ఇది అమలుచేస్తే చాలా కేసులు తగ్గుతాయని ఓ అధికారి చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.