close

తాజా వార్తలు

భర్త ఆశయాల కోసం.. వైమానిక దళంలోకి..!

దిల్లీ: సమీర్‌ అబ్రోల్‌ భారత వైమానిక దళంలో ఆయనొక స్క్వాడ్రన్‌ లీడర్‌.. దేశానికి తన వంతు సేవలు అందించే క్రమంలో ఎన్నో ఆశయాలు ఆయన మదిలో ఉండేవి. ఆ ఆశయాలే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న క్రమంలో విధి వెక్కిరించింది. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిరాజ్‌ 2000 పరీక్షించడానికి ఆయన బయలు దేరగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి మరణించారు. దీంతో దేశానికి ఆయన అందించాలనుకున్న సేవలకు కలలుగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో సమీర్‌ ఆశయాలను పూర్తి చేసేందుకు ఆయన సతీమణి గరిమా అబ్రోల్‌ రంగంలోకి దిగారు. భారత వైమానిక దళంలో చేరేందుకు సంకల్పం చేపట్టి లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) పరీక్షలను సాధించి ఐఏఎఫ్‌కు మార్గం సుగమం చేసుకుంది. విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ అనిల్‌ చోప్రా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. గరిమా అబ్రోల్‌ హైదరాబాద్‌లోని దుండిగల్‌ వైమానిక దళ అకాడమీలో ప్రవేశం పొంది, ఆ తర్వాత 2020,జనవరిలో భారత వైమానిక దళంలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చోప్రా ఆమెను అసాధారణమైన మహిళగా అభివర్ణిస్తూ.. గరిమా తన భర్తతో ఉన్న  ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 
మిరాజ్‌ 2000 విమానం రాడార్‌ పనితీరును తనిఖీ చేసేందుకు స్క్వాడ్రన్‌ లీడర్స్‌ సమీర్‌ అబ్రోల్‌(33), సిద్దార్థ్‌ నేగి(31) ఫిబ్రవరి 1న బయలుదేరారు. ఆ విమానం ఎగిరే సమయంలో ప్రమాదం జరిగిందని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ టెస్ట్‌ పైలట్‌ ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే..


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.