close

తాజా వార్తలు

చెత్తిస్తే చాలు.. ఫీజు అక్కర్లేదు

బిహార్‌: బుద్ధగయలోని పద్మపాణిపాఠశాల పిల్లలు ఇంటినుంచి బయలుదేరి దారివెంట కనపడే చెత్తాచెదారాన్నంతా పోగుచేసుకుంటూ వస్తారు. అందులో ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు, మూతలు, ఇతరత్రా చెత్త అంతా ఉంటుంది. దానిని తీసుకువచ్చి పాఠశాల ఆవరణలోనే ఉంచిన భారీ చెత్తడబ్బాలో వేస్తారు. తర్వాత ఆ చెత్తడబ్బా కాస్తా పునరుత్పాదక, పునర్వినియోగ ప్రక్రియకు తరలిపోతుంది.  తద్వారా వచ్చే డబ్బు పిల్లల ఫీజుకింద స్కూలుకెళ్లిపోతుంది. ఈ ప్రయోగంతో రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. తల్లిదండ్రులకూ ఫీజుల భారం తప్పిపోతోందని పాఠశాల ఉన్నతాధికారి మనోరంజన్‌ ప్రసాద్‌ సందర్శి చెప్పారు. దాదాపు డజను గ్రామాల్లో పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నడిపిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.