close

తాజా వార్తలు

కొలువుల వీరుడు

చదువే వ్యసనమంటున్న రాంబాబు

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఘనత

ఆత్మకూర్‌(ఎస్‌)

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే చాలా గొప్ప విషయమని చెప్పుకుంటున్న ఈ పోటీ ప్రపంచంలో ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద యువకుడు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం అద్భుతమనే చెప్పాలి. గ్రామంలో బతికేందుకు సెంటు భూమిలేక, ఇతర ఉపాధి మార్గాలు కానరాక.. చదువు అనే ఆయుధాన్ని వ్యసనంగా మార్చుకొని కసి, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించిన యువకుడి గాథ ఇది. అతడే ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కోటపహాడ్‌ గ్రామానికి చెందిన ఉడతల రాంబాబు.

సమయం దొరకటం లేదని..

భార్య, కొడుకుతో ..

బీబీనగర్‌ పీఎస్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే రాంబాబు తన చదువుకు సమయం దొరకడం లేదనే ఆలోచనతో భువనగిరి రైల్వే పోలీస్‌స్టేషన్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో ఇంట్లోనే ఎస్సై, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఎన్ని గంటలు చదివింది ముఖ్యం కాదు.. సబ్జెక్టుపై ఎంత పట్టు సాధించామన్నదే ప్రధానమంటున్నారు రాంబాబు. అతడికి 2016లో వివాహమైంది. ఒక బాబు సంతానం. భార్య సృజన అందించిన ప్రోత్సాహంతోనే ఇంట్లోనే ఎనిమిది నెలల పాటు చదివి పంచాయతీ కార్యదర్శి, ఎస్సై ఉద్యోగాలు, గ్రూపు-2 ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు రాంబాబు తెలిపారు. క్రికెట్‌ ఆట అంటే తనకు చాలా ఇష్టమని.. అయినా జీవితంలో స్థిరపడాలంటే క్రికెట్‌ అనే వ్యాపకాన్ని మనసులోనే అణచివేశానన్నారు.

ఏఏ ఉద్యోగాలంటే..?

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కోటపహాడ్‌కు చెందిన ఉడుతల రాంబాబు

రాంబాబు తండ్రి ఉడుతల కోటయ్య గీత కార్మికుడు. తల్లి లక్ష్మమ్మ దినసరి కూలీ. తనతోపాటు ఇంట్లో నలుగురు సంతానం. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబ నేపథ్యం. దీనికి తోడు ఇంట్లో నిత్యం కుటుంబ సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక కుంగుబాటుకు గురై జీవితంలో ఏది సాధించలేక అర్ధంతరంగా జీవితాన్ని ముగించేవాళ్లు చాలామంది ఉంటారు. రాంబాబు అలాంటి తోవలోకి వెళ్లడం కాదు, కష్టాలను, సవాళ్లను ఎలా అధిగమించాలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలో నేర్పుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో ఏపీఎస్పీ, 2013లో సివిల్‌ కానిస్టేబుల్‌, 2018లో పంచాయతీ కార్యదర్శి, 2019లో వెలువడ్డ ఎస్సై ఫలితాల్లో సత్తా చాటారు. అంతేకాకుండా గ్రూపు-2 ఇంటర్వ్యూకు సైతం ఎంపికయ్యారు. విశేషమేమిటంటే శిక్షణ తీసుకోకుండానే ప్రభుత్వ కొలువులు సాధించటం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.