close

తాజా వార్తలు

కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌!

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మలుపుల కొనసాగుతున్నాయి. తాజాగా గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎం కుమారస్వామికి కీలక సూచన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్‌ సూచించారు. ఈ మేరకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్‌ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. అయితే, సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.