close

తాజా వార్తలు

అభాగ్యుల ఆకలి తీరుస్తున్న ‘రోటీ బ్యాంకు’

గుజరాత్‌: తినడానికి తిండి లేని అభాగ్యులకు అండగా నిలవాలన్న గొప్ప సంకల్పంతో సూరత్‌లోని బర్డోలీకి చెందిన కొందరు విద్యార్థులు ఏకమయ్యారు. ‘రోటీ బ్యాంకు’ ఆలోచనతో ఓ స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటై నగరంలో ఇంటింటికీ వెళ్లి ఆహారాన్ని అడుగుతున్నారు. ఓ వాహనాన్ని సమకూర్చుకున్న వారంతా ఇలా రోటీలను సేకరిస్తున్నారు. సదాశయంతో వారు చేస్తున్న పనికి అందరూ చేయూతనిస్తున్నారు. ఇళ్లలో రోటీలు తయారు చేయనివారు ఉన్న తాజా ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇలా సేకరించిన రోటీలను ఆకలితో అలమటిస్తున్న పేదలకు పెడుతున్నారు. ఈ విద్యార్థుల సదాశయానికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్నదే తమ లక్ష్యమని స్వచ్ఛంద సంస్థకు చెందిన రుచి భవ్‌సార్‌ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.