close

తాజా వార్తలు

కల్తీ చేస్తే కఠిన చర్యలే: కేంద్రమంత్రి

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 26 వేల కల్తీ ఆహార పదార్థాలను గుర్తించామని కేంద్ర ఆహారశాఖామంత్రి రామేశ్వర్‌ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. కల్తీ ఆహారపదార్థాలు ఉపయోగించినందుకు గానూ సదరు బాధ్యుల నుంచి రూ.32 కోట్ల జరిమానాను వసూలు చేసినట్లు తెలిపారు.2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 94,288 ఆహార నమూనాలను పరిశీలించగా, అందులో 26,077 నమూనాలు కల్తీ, తప్పుడు ముద్రలు వేసినవిగా తేలిందన్నారు. ఈ కల్తీ ఆహారపదార్థాలను ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో గుర్తించినట్టుగా వెల్లడించారు. ఆహారభద్రతాశాఖ పనితీరు గురించి ఆయన వివరిస్తూ..అన్ని రాష్ట్రాల్లోని ఆహారభద్రతా విభాగ అధికారులు తరచుగా తనిఖీలు చేస్తూనే ఉంటారని తెలిపారు. ఫిర్యాదులు అందినే వెంటనే విచారణ జరిపి కఠినచర్యలు అమలు చేసేవిధంగా నిఘా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఎవరైనా ఆహారపదార్థాలలో కల్తీ చేసినట్లు నిరూపితమైతే ఆహారభద్రతా చట్టం 2006 నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటునట్లు మంత్రి రామేశ్వర్‌ తెలి పేర్కొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.