close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. కర్ణాటక అసెంబ్లీ మరోసారి వాయిదా

కర్ణాటక అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది. బలపరీక్షకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ వెలువడకుండానే సభ సోమవారానికి స్పీకర్‌ వాయిదా వేశారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ సభ్యులు బలపరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. సభలో నిల్చుని ఆందోళనకు దిగారు. వారి ఆందోళన నడుమ సభను స్పీకర్‌ వాయిదా వేశారు. సభను వాయిదా వేసే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేయగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా బలపరీక్ష చేపట్టాలంటూ భాజపా సభ్యులు తమ ప్రయత్నాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం కేసీఆర్‌ను కలిసిన రాజగోపాల్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. డిండి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సారథిగా ప్రియాంక అయితే ఓకే!

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కొత్త సారథి వేటలో పడింది. గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా కొత్తవారిని నియమించాలని రాహుల్‌ ఇది వరకే చెప్పారు. ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్‌ సీనియర్లు ఏకీభవించడం లేదు. గాంధీ కుటుంబీకులే అధ్యక్ష పదవిలో ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబీకులే ఉండాలన్నది నా వాదన కూడా. నాకు తెలిసి ఈ పదవికి ప్రియాంక గాంధీ అయితే సరిపోతుంది’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘విరాళాల వివరాలు భాజపా బహిర్గతం చేయాలి’

బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికార భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ భాజపాకు అందిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. వెనకబడిన వర్గాలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎదిగితే భాజపా సహించదని.. అధికారం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి వారిపై అక్రమ కేసులు బనాయిస్తారని ఆరోపించారు. మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్‌, ఆయన భార్య విచితర్‌లతకు చెందిన ఏడు ఎకరాల బినామీ వాణిజ్య స్థలాన్ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు జప్తు చేసిన మరుసటి రోజే ఈ విమర్శలు చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎవరు’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం

6. ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానంలోకి జియో

డేటా, కాల్స్‌ విషయంలో వినూత్నమైన ఆఫర్లను ప్రకటించిన జియో ఈ రంగంలో అడుగుపెట్టి కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. తాజాగా వినియోగదారుల సంఖ్యాపరంగా ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ట్రాయ్‌ విడుదల చేసిన మే నెల నివేదికలో తేలింది. ట్రాయ్‌ నివేదిక ప్రకారం 387.55 మిలియన్ల వినియోగదారులతో వొడాఫోన్‌-ఐడియా ప్రథమ స్థానంలో నిలవగా, రిలయన్స్‌ జియో (323 మిలియన్లు), ఎయిర్‌టెల్‌ (320.38 మిలియన్లు) వినియోగదారులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కిలో చెత్తకు భోజనం.. అర కిలోకు టిఫిన్‌!

ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణ సాధ్యం కాని సమస్య ఏదైనా ఉంటే అది ప్లాస్టికే. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తెచ్చినా.. ప్లాస్టిక్‌ నియంత్రణకు ఎంతలా పాటుపడుతున్నా ఏదో ఓ మూల ప్లాస్టిక్‌ వల్ల హాని జరుగుతూనే ఉంది. ఈ హానిని కొంత మేర ఎదుర్కొనేందుకు ఛత్తీస్‌ఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీ వినూత్న ప్రయోగంతో ముందుకొచ్చింది. చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని ప్రకటించింది. నిరాశ్రయులు ఎవరైనా కిలో చెత్తను తీసుకువస్తే వారికి భోజనం, అర కిలో చెత్త తెస్తే అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇక కెప్టెన్‌ సస్పెండ్‌ అవ్వడు!

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. ఇటీవల కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను ప్రకటించిన ఐసీసీ మరో తాజా నిర్ణయాన్ని తీసుకుంది. స్లోఓవర్‌ రేటు కారణంగా జట్టు సారథి సస్పెండ్‌కు గురికాడని తెలిపింది. దీనికి బదులుగా ఆ జట్టుకు దక్కే పోటీ పాయింట్లను తగ్గించనుంది. ఈ కొత్త నియమ నిబంధనలను ఆగస్టులో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నుంచి అమలు చేయనుంది. ఆగస్టు 1న యాషెస్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్ల మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2021 జూన్‌లో జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బంగ్లాదేశ్ అసలెక్కడుంది?: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఏం మాట్లాడినా వార్త అవుతుంది. ఇరాక్‌లోని యాజీదీలు, మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థుల సంబంధించిన అంశాలపై వారి తరఫు ప్రతినిధులు మాట్లాడుతుండగా వాటిపై అవగాహన లేనట్లుగా కనిపించారు. ఆ సందర్భంగా బంగ్లాదేశ్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇరాక్, మయన్మార్ దేశాల్లో మైనార్టీ వర్గాలపై జరిగిన మతపరమైన హింస నుంచి బతికి బయటపడ్డ కొంతమందితో ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా ఈ పరిస్థితి ఎదురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు

 పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో నరికాడు. ఈ ఘటన గోపాలపురం మండలంలోని దొండపూడిలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కాంతారావు అనే వ్యక్తి భార్య పుష్పలత, అత్త లక్ష్మితో పాటు అడ్డొచ్చిన బావ మరిది మంగారావుపైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పుష్పలత, లక్ష్మి మృతిచెందగా, బావ మరిది మంగారావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానికులు కాంతారావును నిర్భందించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.