close

తాజా వార్తలు

నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ ఐకాస

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు నాగార్జున వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌-3ని నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస విద్యార్థులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. బిగ్‌బాస్‌- 3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా వ్యాఖ్యాతగా ఉంటారని ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.