
తాజా వార్తలు
అమరావతి: ఎందులో ఆదర్శం అని చంద్రబాబుని జగన్ అడగటం అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకావడం లేదంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో ఎద్దేవాచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి చంద్రబాబు ఆదర్శంగా నిలిచారన్నారు. చంద్రబాబు కష్టాన్నే జగన్ తండ్రి ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారని మండిపడ్డారు. 2009 ఎన్నికలకు ముందు యూనిట్ విద్యుత్‌ను రూ.16కు వైఎస్ కొనిపించారని, డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని విమర్శించారు.
విద్యుత్ సంస్థలకు పెట్టిన కన్నాన్ని పూడ్చేందుకు 2015లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని రూ.8,892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేశామని లోకేశ్ వెల్లడించారు. 2015-16లో రూ.4.63కు కొన్న విద్యుత్‌ను 2018-19లో రూ.2.72కు కొంటున్నామని, ఈ విషయం చెప్పకుండా పాతధరల మీదే రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. ‘‘విద్యుత్‌ను ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం.. ప్రజాధనం వృథా అయిపోతోంది అంటూ సుద్దపూస కబుర్లు చెప్పే మీరు.. సొంత సండూర్ పవర్ సంస్థ కర్ణాటకలో HESCOMకు రూ.4.50కి ఎందుకు అమ్ముతోందని’’ అని లోకేశ్ నిలదీశారు.
‘‘మీ జేబులో వేసుకునేటప్పుడు అది ప్రజాధనం అని గుర్తుకు రాదా’’ అని ప్రశ్నించారు. ‘‘థర్మల్ పవర్ తక్కువ రేటు కదా ఎందుకు వాడుకోకూడదు అని వాదిస్తున్న మీ తెలివితేటలకు నవ్వొస్తోంది. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతోంది. 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకుందన్న విషయం మీకు తెలియక పోవడం మా దురదృష్టమని’’ లోకేశ్ ఎద్దేవాచేశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
