close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. శాశ్వత ఉద్యోగాల కల్పన ఓ రికార్డు: జగన్‌

తెలుగు రాష్ట్రాల చరిత్రలో 1,33,494 శాశ్వత ఉద్యోగాల కల్పన ఓ రికార్డు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని వెల్లడించారు. గ్రామసచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని జగన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రకృతిపై అవగాహన పెరగాలి: కిషన్‌ రెడ్డి

రోజురోజుకు అంతరించి పోతున్న ప్రకృతి సంపదను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ది సొసైటీ ఆఫ్ ఎర్త్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ‘వాక్ టు సేవ్ అవర్ జియో హెరిటేజ్’ పేరిట అవగాహన పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వైభ‌వంగా ఉజ్జ‌యిని మ‌హంకాళీ బోనాలు

4. సికింద్రాబాద్‌లో విషాదం

సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌మండిలో ఓ పురాతన భవనం కూలి 14 నెలల బాలుడు మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సదరు భవనంలో స్వాతి దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం ఇంట్లో పడుకున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వాళ్ల కుమారుడు గీతామ్స్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే  మృతిచెందగా స్వాతి తీవ్రంగా గాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. విమానం ఆలస్యం.. ఆందోళనలో అభ్యర్థులు

శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం 4 గంటలు ఆలస్యమైనా బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం7.45 గంటలకు బయల్దేరాల్సిన విమానం ఇంకా బయలు దేరలేదు. ప్రయాణికుల్లో కొందరు విశాఖలో జరిగే ఆర్‌బీఐ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. దీంతో పరీక్షకు ఆలస్యమవుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఎవరి బలం ఏమిటో రేపు తేలుతుంది: యడ్యూరప్ప

కర్ణాటకలో ఎవరి బలం ఏమిటో సోమవారం తేలుతుందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో భాజపా నేతలు హోటల్‌ రమడాలో సమావేశం కానున్నారు. సభలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను ఓటింగ్ విషయంలో బలవంతం చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ జారీ చేసే విప్కు విలువ లేదని యడ్యూరప్ప అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అందుకే ఆ పదవి రేసులో లేను: రాజన్‌

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(బీఓఈ) గవర్నర్‌ మార్క్‌ క్యార్నీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. ఆ స్థానంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. రాజన్‌ మాత్రం అందుకు సుముఖంగా లేరు. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో బీఓఈపై తీవ్ర రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోలేదని రాజన్‌ బీబీసీకి ఇచ్చిన ముఖాముఖీలో వెల్లడించారు. పలు దేశాల కేంద్ర బ్యాంకు వ్యవహారాల్లో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్‌ క్రికెటర్‌

టీమిండియాకి చెందిన ఓ సీనియర్‌ క్రికెటర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో బీసీసీఐ కుటుంబ నిబంధనలను ఉల్లఘించాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోర్నీ మధ్యలో 15 రోజులపాటు ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతించినా.. ఆ క్రికెటర్‌ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ ఆసాంతం తన భార్యతోనే కలిసి ఉన్నాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తాజాగా వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నిరుపేదకు రూ.128కోట్ల విద్యుత్‌ బిల్లు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో విద్యుత్ శాఖ అధికారుల దారుణమైన నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగుచూసింది. రాష్ట్రంలోని హాపూర్‌ పరిధిలోని ఛామ్రీ గ్రామానికి చెందిన షామీమ్‌ అనే నిరుపేదకు ఏకంగా రూ.128 కోట్లలను విద్యుత్‌ బిల్లు వేశారు. సాధారణ బిల్లు కట్టాల్సిన గడువు దాటి పోవడంతో ఇంతమొత్తం కట్టాలని అధికారులు అదేశించారు. ఆ తర్వాత సాంకేతిక లోపాల కారణంగా అలా వచ్చి ఉండొచ్చని అన్నారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. జపాన్‌లో మజారియా యానిమేషన్‌ గేమింగ్‌ కేంద్రం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.