close

తాజా వార్తలు

ఏపీ పాఠశాలల్లో ‘చంద్రయాన్‌ 2 లైవ్‌’

అమరావతి: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు, టీవీ, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు చంద్రయాన్ 2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలివ్వాలని సూచించారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు చంద్రయాన్ 2 విశేషాలతో పాటు దాని ప్రాముఖ్యతను విద్యార్థులు తెలియజేయాలని మంత్రి ఆదేశించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.