close

తాజా వార్తలు

అద్భుతం.. అన్నదాత!

ఝార్ఖండ్‌: అతను ఓ సాధారణ రైతు.. చదువు కూడా లేదు.. ఉన్నది మూడెకరాల భూమి.. పొలం దున్నుకోవడానికి ట్రాక్టర్‌ను పెట్టుకోలేని పేదరికం. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అతనికి తట్టిన ఉపాయంతో ఏకంగా ఓ నేలదున్నే యంత్రాన్నే తయారుచేశారు. హజారిభాగ్‌ జిల్లా ఉచ్ఛాధానామిలన్‌ తండాకు చెందిన మహేశ్‌ కర్మాలీ ఈ అద్భుతాన్ని సాధించడమే కాకుండా ఇప్పుడు పొరుగు అన్నదాతలకూ అండగా నిలుస్తున్నారు. పాత స్కూటర్‌, ఇతర పరికరాలతోనే ఈ యంత్రాన్ని రూపొందించారు. నాగలి అమర్చిన ద్విచక్ర వాహనానికి మోటారు బిగించి దున్నేందుకు అనువుగా తయారు చేశారు. ఎకరా పొలం దున్నాలంటే మిగతా పద్ధతుల్లో దాదాపు రూ. 1,500-1,600 ఖర్చవుతుండగా ఈ యంత్రంతో కేవలం రూ. 400-500లతోనే పని పూర్తవుతుందని మహేశ్‌ తెలిపారు. ఒక్కరే సులభంగా పొలం దున్నుకునేందుకు వీలున్న ఈ యంత్రం ఇప్పుడు ఎందరో ఇతర రైతుల అవసరాలూ తీరుస్తోంది. ప్రభుత్వం ఇలాంటి యంత్రాలు తయారు చేసి రైతులకు మేలు చేకూర్చాలని మహేశ్‌ కోరుతున్నారు. దాదాపు రూ. 10 వేలకే ఇలాంటి యంత్రాన్ని తయారు చేయవచ్చని తెలిపారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.