close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. ఇవాళే బలపరీక్ష నిర్వహిస్తాం: రమేశ్‌కుమార్‌

కర్ణాటక రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బల పరీక్షను రెండు రోజులు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. అసమ్మతి ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయనకు తెలిపారు. ఇందుకు స్పీకర్ రమేశ్‌ కుమార్‌ నిరాకరించారు. శుక్రవారం చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు బల పరీక్ష నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12గంటల తర్వాతే సభ మొదలైంది. రాత్రి 7గంటల సమయంలోనైనా బల పరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత

గత ఏడాది బోనాల నిర్వహణపై పెదవి విరిచిన అమ్మవారు ఈ సంవత్సరం ఉత్సవాలు తననెంతో సంతోషపెట్టాయని అన్నారు. ఈ మేరకు జోగిని స్వర్ణలతని ఆవహించి భవిష్యవాణి వినిపించారు. ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారని చెప్పారు. భక్తులు సమర్పించిన ముడుపులను సంతోషంగా అందుకున్నానని అన్నారు. ఆనవాయితీ ప్రకారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.. వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. యథావిధిగా తెలంగాణ గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీ శాసనమండలి నుంచి తెదేపా వాకౌట్‌

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే మండలి నుంచి తెదేపా సభ్యులు వాకౌట్‌ చేశారు. కరవుపై చర్చ జరపాలని మండలిలో తెదేపా నేతలు పట్టుబట్టారు. రాష్ట్రంలో కరవును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదంటూ మండలి నుంచి తెదేపా నేతలు బయటకు వెళ్లిపోయారు. తమ ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానం చెప్పలేదని, కరవు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు. 

5. అసమ్మతి ఎమ్మెల్యేలకు సమన్లు

రాజీనామా చేసిన 12 మంది కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సమన్లు జారీ చేశారు. రేపటిలోగా వచ్చి వారి రాజీనామాలకు కారణాన్ని వివరించాలని ఆదేశించారు. కారణం సరైందని తేలకపోతే చట్టప్రకారం వారిపై అనర్హత వేటు వేస్తామని తెలిపారు. మంగళవారం అందరూ వచ్చి తనకు కనిపించాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దేశం నిన్ను చూసి గర్విస్తోంది హిమ..

అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. హిమ్‌దాస్‌ను చూసి దేశం గర్విస్తుందని, నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు దేశానికి అందించినందుకు అభినందలు తెలిపారు. పరుగుల తార హిమదాస్‌ నెల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. దీనిపై భారత ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘టాయిలెట్లు శుభ్రం చేయడానికి ఎంపీలం కాలేదు’

భోపాల్‌ పార్లమెంటు సభ్యురాలు, భాజపా నేత ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీలుగా ఎన్నికయ్యింది టాయిలెట్లు శుభ్రం చేయడానికి కాదంటూ వ్యాఖ్యానించారు. భాజపా కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకటి గుర్తుంచుకోండి..మేమున్నది మురికి కాలువలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కాదు. దేని కోసం అయితే ఎన్నికయ్యామో ఆ బాధ్యతల్ని నిజాయతీగా నిర్వర్తిస్తాం. ఒక ఎంపీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయడమే మా విధి’’ అని ప్రజ్ఞా వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘ఉగ్రవాదులు రాష్ట్రాన్ని దోచుకున్నవారిని చంపాలి’

జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆదివారం ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదులు చంపాల్సింది సామాన్య పౌరుల్ని కాదని.. ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న వ్యక్తుల్ని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేకెత్తించాయి. ‘‘తుపాకులు పట్టుకున్న ఈ వ్యక్తులు తమ సొంత మనుషుల్ని, భద్రతా సిబ్బందిని పొట్టన బెట్టుకుంటున్నారు. వారిని ఎందుకు చంపుతున్నారు? కశ్మీర్‌ సంపదను దోచుకున్న వారిని చంపేయండి. అలాంటి వారిని చంపుతున్నారా?’’ అని మాలిక్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే.. ఉగ్రవాదులు హింసను వీడాలని.. తుపాకులకు భారత ప్రభుత్వం ఏమాత్రం భయపడదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నేరస్థులకు ఏసీ గదులు, టీవీలు ఎందుకు?

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మీద ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పాకిస్థానీలను ఉద్దేశించి ఆయన సుమారు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. వాషింగ్టన్‌లోని ఎరేనా స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘నవాజ్‌ షరీఫ్‌ జైల్లో ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయనకు ఇంటి నుంచే భోజనం వస్తోంది. ఏసీ గదులు, టీవీలను ఏర్పాటు చేశారు. ఒక ఖైదీకి అన్ని సౌకర్యాలు ఉండటం నేరాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. షరీఫ్‌కు అవన్నీ లేకుండా చేస్తాను. అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న ఫేస్‌యాప్‌..!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.