close

తాజా వార్తలు

నేటి విశేషాలు... ఆసక్తిక‌ర చిత్రాలు

జాబిలిపై జెండా ఎగరేద్దాం

శ్రీహరికోట: జాబిలిపై పరిశోధనల కోసం చంద్రయాన్ - 2 మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేసిన ప్రయోగం విజయవంతమైన సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న యువతులు


చంద్రయాన్ -2 ప్రయోగం సందర్భంగా సూరత్‌లోని ఓ మాల్‌లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక చిత్రాన్ని రంగులతో వేస్తున్న కళాకారులు  

గ్యాంగ్‌ లీడ‌ర్ అలియాస్‌ పెన్సిల్‌


నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’. టీజ‌ర్ జులై 24 (బుధ‌వారం) ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ ట్విట‌ర్‌లో పేర్కొంది. సినిమాలో త‌న పేరు ‘పెన్సిల్’ అని హీరో నాని ట్వీట్ చేశారు. ‘‘న‌న్ను మా గ్యాంగ్‌ను క‌ల‌వండి. వారు చాలా స‌ర‌దాగా ఉంటారు’’ అని పోస్ట్ చేశారు

బండెనక బండి..! 

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్‌లో సోమవారం కనిపించిన దృశ్యం. ఇటీవల ఈదురుగాలులకు రాష్ట్రంలో పలుచోట్ల అరటి తోటలు నెలకొరిగాయి. దీంతో పంట దిగుబడి తగ్గి అరటిగెలలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఒక్కో గెల రూ.250 నుంచి రూ.300 వరకు పలుకుతోందని రైతులు తెలిపారు 

‘మెదడు’ కాదు.. పుట్టగొడుగు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం తాడాలవారిపాలెంలో పెరిగిన పెద్ద పుట్టగొడుగును చూపుతున్న గ్రామస్థుడు

‘రెట్టింపు’ ఆనందం

 సూర్యాపేట: పెరిగిన ఆసరా పింఛన్‌ తీసుకున్న ఆనందంలో దివ్యాంగుడు. తెరాస ప్రభుత్వ ఎన్నికల హామీల్లో భాగంగా ఆసరా ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. గతంలో ప్రతి నెలా వృద్ధులకు రూ.1000, దివ్యాంగులకు రూ.1500 ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం వృద్ధులకు రూ. 2016, దివ్యాంగులకు రూ.3016 అందజేస్తొంది

ఇదే బాగుండేది..!


ప్రస్తుతం ఎవ‌రి చేతిలో చూసినా సెల్‌ఫోనే. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వ‌ర‌కూ అంద‌రూ వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాక్సర్‌ విజేంద‌ర్ సింగ్ ట్విట‌ర్లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఫోన్‌కు వైర్ (ల్యాండ్ లైన్లు)ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. సెల్‌ఫోన్లు వచ్చాక ప్రజలు ఎక్కువ‌గా దానిపైనే గడుపుతున్నారు. దాని బ‌దులు ఎక్కువ స‌మ‌యం ప్రజలతో గడపండి’ అంటూ సందేశమిచ్చారు.
 

స్వీట్‌ వార్నింగ్‌..!


మాదాపూర్‌లోని శిల్పక‌ళావేదిక ఎదురుగా ఉన్న ఆలివ్ మిఠాయి, ట్రీన్ గార్డ్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో హెల్మెట్‌పై అవ‌గాహ‌న కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మిఠాయిల బాక్సుపై హెల్మెట్‌ వాడ‌కంపై అవ‌గాహ‌న క‌లిగే విధంగా గీసిన కార్టూన్‌లు ఆక‌ట్టుకున్నాయి.

హే డ్యూడ్‌..!


ఒలింపిక్స్‌-2020 క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న నేప‌థ్యంలో దీనికి సంబంధించి ఆ దేశం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడంలో భాగంగా నిర్వాహ‌కులు రోబోల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా అక్కడ ప్రదర్శనకు ఉంచిన రోబో ఇలా ఓ బాలుడికి హై-ఫై ఇస్తూ కనిపించింది.

మనకూ ఉంటే బాగుణ్ణు!


అమెరికాలోని వర్జిన్‌ ఐలాండ్స్‌లోని అందమైన ద్వీపాల్లో ఇదొకటి. దీని పేరు లిటిల్‌ సెయింట్‌ జేమ్స్‌ ఐలాండ్‌. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జెఫ్రీ ఇప్ట్సీన్‌కు చెందిన ఈ ద్వీపం చూపరులను ఆకట్టుకుంటోంది.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం


ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేకు వ్యతిరేకంగా రాజధాని మనీలా సమీపంలోని క్యూజోన్‌ సిటీలో ఆందోళనలు జరిగాయి. నేడు రోడ్రిగో 4వ స్టేట్‌ ఆఫ్‌ నేషన్‌ ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చిత్రాలు ఉన్న భారీ పెయింటింగ్‌ను దహనం చేశారు.   

కాశీ విశ్వనాథుని దర్శనం కోసం..


 వార‌ణాసిలోని కాశీ విశ్వనాథ ఆల‌యంలో స్వామివారి ద‌ర్శనానికి క్యూలో వేచి ఉన్న భ‌క్తులు


  రాంచీలోని ఆల‌యంలో శివునికి అభిషేకం చేస్తున్న భ‌క్తులు

కా..జిల్‌.. జిల్‌..!


హైద‌రాబాద్ వ‌న‌స్థలిపురంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన మాంగ‌ళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సంద‌డి చేసిన సినీన‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు.

కాజ‌ల్‌ను చూసేందుకు ఎగ‌బ‌డుతున్న అభిమానులు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.