close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. కర్ణాటకీయంలో కొత్త ట్విస్ట్‌!

కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ డెడ్‌లైన్‌ విధించారు. రాత్రి 9 గంటల వరకు అందుకు సమయమిస్తున్నట్టు సీఎం కుమారస్వామికి సూచించారు. కర్ణాటక శాసనసభలోని పరిణామాలు ఉదయం నుంచీ అనూహ్య మలుపులు తిరగుతూ వస్తున్నాయి. ఈరోజు బలపరీక్ష నిర్వహిస్తామని స్పీకర్‌ రెండు రోజుల ముందే ప్రకటించినప్పటికీ అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మాత్రం దానికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వరల్డ్‌బ్యాంకు వెనకడుగుకు వైకాపానే కారణం

ఆంధ్రుల ఆత్మగౌరవానికి రాజధాని అమరావతి ప్రతీక అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా మొదటి నుంచీ అమరావతిని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. దీనికోసం ఆ పార్టీ నేతలు సర్వశక్తులూ ఒడ్డారన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా వైకాపా నేతలు రాలేదని, పెట్టుబడులు కూడా అడ్డుకున్నారన్నారు. అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లేందుకు పూర్తి కారణం వైకాపాయేనని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీ శాసనసభ ముందుకు ఆరు కీలక బిల్లులు

ఏపీ ప్రభుత్వం ఇవాళ ఆరు కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, స్ధానికులకు పరిశ్రమల్లో 75శాతం కోటా కల్పన, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపు ఉన్నాయి. వైకాపా మేనిఫెస్టోలోని నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం వీటిని సభలో ప్రవేశపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కనువిందుచేస్తున్న ‘చింతల మాధర’ జలపాతం!

5. నా ఆస్తులు అప్పగించాలి: ఈడీని కోరిన గాలి

సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి తన రూ.వెయ్యికోట్ల విలువైన ఆస్తులను అప్పగించాలని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కోరారు. ఓఎంసీ కేసు విచారణ నిమిత్తం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను తనకు అప్పగించాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. స.హ. సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన హోదాను ఉపసంహరించేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు (సవరణ) బిల్లు-2019 లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ బిల్లు కింద సమాచార కమిషనర్ల వేతనాలు, సర్వీసు నిబంధనలను నిర్ధరించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అమరావతిలో లిఫ్ట్‌ ప్రమాదం: ముగ్గురి మృతి

ఏపీ రాజధాని అమరావతిలో ప్రమాదం జరిగింది. రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనంలో లిఫ్ట్‌లో ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. భవనం ఐదో అంతస్థులో వారు పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను బిహార్‌కు చెందిన రాహుల్‌ కుమార్‌, కృపాల్‌ కుమార్‌, సురేంద్ర కుమార్‌గా గుర్తించారు. 

8. వోడా-ఐడియాతో జీ5యాప్‌

ఇకనుంచి వొడాఫోన్‌-ఐడియా వినియోగదారులకు జీటీవి కార్యక్రమాలను అందించే జీ5 యాప్‌ను ప్రత్యేకంగా అందించనున్నట్లు వొడాఫోన్‌-ఐడియా సంస్థ సోమవారం తెలిపింది. వివరాల్లోకి వెళితే టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడా-ఐడియాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆ పోటీని తట్టుకోవాలంటే తమ వినియోగాదారులకు మరిన్ని అదనపు సేవలు అందించాలని వొడాఫోన్‌-ఐడియా భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న జీ5యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఎస్సార్‌ స్టీల్‌పై సుప్రీం స్టే

ఎస్సార్‌ స్టీల్‌ దివాళా కేసులో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుతూ సుప్రీం కోర్టు స్టేటస్‌ కో జారీ చేసింది. జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. మానిటరింగ్‌ కమిటీ ఆగస్టు 7వ తేదీ వరకు పని చేసుకోవచ్చని పేర్కొంది. జులై 4వ తేదీన ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పును రుణ దాతల కమిటీ సుప్రీం కోర్టులో ఛాలెంజ్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వెండితెరపై మురళీధరన్‌ ‘800’ దాడి?

శ్రీలంక క్రికెటర్‌, భయంకర స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌పై త్వరలో బయోపిక్‌ నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన పాత్రను తమిళ కథానాయకుడు విజయ్‌ సేతుపతి పోషిస్తాడని సమాచారం. అయితే సినిమాకు సంబంధించిన ఏ విషయమూ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సినిమా పేరు ‘800’ అట! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.