close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. మరికాసేపట్లో తేలనున్న కుమార భవితవ్యం

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ భవితవ్యం తేలే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న స్పీకర్‌ సభను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స.హ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు: సోనియా

సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆరోపించారు. చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని విమర్శించారు. పదేళ్లలో 60లక్షల మంది సమాచారహక్కు(స.హ) చట్టాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చట్టం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అసెంబ్లీ నుంచి తెదేపా వాకౌట్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ తెదేపా మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. మంగళవారం సభ ప్రారంభం నుంచే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయడంపై పెద్ద దుమారం చెలరేగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జియో గిగా ఫైబర్‌ సేవలు ఆరోజు నుంచేనా?

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో త్వరలోనే బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్‌ జియో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఈ ఎలకలకు తోకలు లేవండోయ్‌..!

6. ఎంఐ సేల్‌ 2019: ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షామీ ఐదో వార్షికోత్సవ సందర్భంగా పలు ఫోన్లపై రాయితీ ఇస్తోంది. ఇ-కామర్‌ వెబ్‌సైట్లు అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, ఎంఐ.కామ్‌లోనూ జులై 25వ తేదీ వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ.3,300 వరకూ తగ్గింపును అందిస్తుండగా, కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.7,500 వరకూ రాయితీ ఇస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకు ఆఫర్‌ కింద మరో 5శాతం అదనంగా రాయితీని పొందవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ప్రభుత్వంలో అసహనం పెరుగుతోంది:చంద్రబాబు

ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఒక బీసీ నాయకుడిని సస్పెండ్‌ చేసి బీసీ బిల్లు ప్రవేశ పెట్టారనే విషయం అర్థమవుతోందని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును అకారణంగా సస్పెండ్‌ చేస్తే సభలో తాము ఖాళీగా ఎలా కూర్చుంటామని ప్రశ్నించారు. ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోతోందని.. రాష్ట్రమంతా అభద్రతా భావం వచ్చిందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. విజయసాయిరెడ్డితో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి భేటీ

దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి తనను డిప్యుటేషన్‌పై పంపాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో క్యాడర్‌లో పనిచేస్తున్న శ్రీలక్ష్మి బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అసలేం జరిగిందో ప్రధాని చెప్పాలి: రాహుల్

కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘అసలేం జరిగిందో మోదీ దేశ ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బలహీన సంకేతాలతో నాలుగో రోజూ నష్టాలు

వరుసగా నాలుగో రోజూ సూచీలు నష్టాలను చవి చూశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48.39 పాయింట్ల నష్టపోయి, 37,982.74వద్దకు చేరగా, నిఫ్టీ 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు పడిపోయింది. దేశీయంగా బలహీన సంకేతాలు, విదేశీ మదుపరుల స్వీకరణ నష్టాలకు కారణమైంది. దీంతో పాటు కార్పొరేట్‌ సంస్థల ఆదాయలు అంతంత మాత్రంగా ఉండటం మార్కెట్‌పై ప్రభావం చూపిందని ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.