close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. విశ్వాస పరీక్షలో కుమార ఓటమి!

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది. 105 - 99 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించిన కర్ణాటక రాజకీయానికి తెరపడింది. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కీలక బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం

ఏపీ శాసనసభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుతో పాటు, మహిళలకు నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం నామినేషన్‌పై చేపట్టే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే ఈ బిల్లులకు సభ ఆమోదం లభించింది. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన అంశంలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లులపై అధికార పార్టీ సభ్యులు చర్చించారు. అనంతరం బిల్లులకు ఆమోదం లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌!

బుధవారం థెరిసా మే బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయనుండటంతో..ఆమె వారసుడిగా బోరిస్‌ జాన్సన్‌ ఎన్నిక దాదాపు ఖరారైంది. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో మంగళవారం ఆయన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి జెరెమీ హంట్‌ను ఓడించడంతో ఈ మాజీ లండన్ మేయర్‌ బుధవారం ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకోవడం ఇక లాంఛనమే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నా రక్తం మరిగిపోయింది: స్పీకర్‌ రమేశ్‌

బెంగళూరు విధాన సభలో విశ్వాస తీర్మానంపై చర్చలో ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. సభలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. సభలో జరిగిన పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోయిందని వ్యాఖ్యానించారు. కనీస సంప్రదాయ ప్రక్రియ పాటించకుండా తనను ఇబ్బంది పెట్టారన్నారు. స్పీకర్‌ పదవిలో రాజ్యాంగబద్ధంగా తన బాధ్యతను తాను నిర్వర్తించానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కృష్ణాలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ

ఏపీ రాజధాని సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌కు విన్నవించింది. జల రవాణ కోసం ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీశామని తెలిపింది. ఏ ప్రాతిపదికన పూడికతీత చేపట్టారని.. దానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?అని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఏపీకి రుణంపై మరో బ్యాంకు వెనకడుగు!

నిధుల కష్టాలతో నెమ్మదిగా సాగుతున్న అమరావతి నిర్మాణానికి మరో అవరోధం ఎదురైంది. ప్రపంచ బ్యాంకు బాటలోనే అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) కూడా ఉపసంహరించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.1400 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో అర్థం కావడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కాంగ్రెస్‌ నేతలు వివేక్‌తో పోవడమేంది?:వీహెచ్‌

మాజీ ఎంపీ వివేక్‌ నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి కాంగ్రెస్‌ వాళ్లు ఎందుకు వెళ్లారని ఆ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ వల్ల ఎక్కువ లాభం పొందింది వెంకటస్వామి కుటుంబమేనన్నారు. వివేక్‌ ఇప్పుడు భాజపాలో చేరుతున్నారట.. పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ సొంత కార్యాచరణ లేకుండా వివేక్‌తో పోవడం ఏంది? అని ఆయన ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కేరళలో ప్రారంభమైన ఆనయుట్టు వేడుకలు..!

9. ‘ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్ సమస్య కొలిక్కిరాదు’

కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. తమ ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం ద్వైపాక్షిక చర్చలతో ఎప్పటికీ  పరిష్కారం కాదని ఇమ్రాన్‌ మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేత సౌధంలో సమావేశమైన ట్రంప్‌, ఇమ్రాన్ అనేక అంశాల మీద చర్చలు జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. డేటా చోరీతో ఒక్కో సంస్థకు రూ.12.8కోట్ల నష్టం!

ప్రస్తుతం అన్ని కంపెనీలు, సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సమాచార చోరీ. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఒక రూపంలో సమాచారం బయటకు వెళ్లిపోతోంది. అలా వెళ్లిన సమాచారం వల్ల ఒక కంపెనీ సగటున ఎంత నష్టపోతోందో తెలుసా? అక్షరాల రూ.12.8కోట్లు. ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐబీఎం ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 2018 నుంచి ఏప్రిల్‌ 2019 వరకూ సమాచార చోరీ ఘటనలను, దాని వల్ల నష్టాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.