close

తాజా వార్తలు

వర్షాల కోసం గాడిదలకు పెళ్లి

బోయిన్‌పల్లి: సాధారణంగా గ్రామాల్లో ఎక్కడైనా వర్షాలు కురవాలని ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. కప్పలకు పెళ్లి చేయడం, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం వంటివి చూస్తుంటాం.. కానీ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఓ సామాజిక వర్గం వారు భిన్నంగా గాడిదలకు పెళ్లి చేశారు. రెండు గాడిదలకు తాళి, మెట్టెలతో సంప్రదాయబద్ధంగా వివాహం చేశారు. సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అందుకే ఈ వివాహం జరిపిస్తున్నామని వారు అంటున్నారు. ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని, ఇలా వివాహం జరపడం పూర్వం నుంచి తమ సామాజిక వర్గంలో ఆనవాయితీ అని వారు అంటున్నారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.