Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 132195
            [news_title_telugu_html] => 

ఓ మెయిల్‌తో రూ.70 లక్షలకు టోపీ!

[news_title_telugu] => ఓ మెయిల్‌తో రూ.70 లక్షలకు టోపీ! [news_title_english] => Crime with mail [news_short_description] => ఓ అధికారి అత్యాశ.. అక్షరాలా రూ.70లక్షల కష్టార్జితాన్ని గంగపాలు  చేసింది.. గుడ్డిగా నమ్మిన ఓ అసత్య సమాచారం ఆయనను నిలువునా ముంచేసింది. ... [news_tags_keywords] => Crime,Visakhapatnam [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-26 07:43:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఓ మెయిల్‌తో రూ.70 లక్షలకు టోపీ! - Crime with mail - EENADU
close

తాజా వార్తలు

ఓ మెయిల్‌తో రూ.70 లక్షలకు టోపీ!

రూ.2500 కోట్ల లాటరీ తగిలిందంటూ ఆశ చూపి మోసం 
2015 నుంచి దఫదఫాలుగా విశాఖ వాసిని కొల్లగొట్టిన కేటుగాళ్లు 
సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

ఎం.వి.పి.కాలనీ(విశాఖ): ఓ అధికారి అత్యాశ.. అక్షరాలా రూ.70లక్షల కష్టార్జితాన్ని గంగపాలు  చేసింది.. గుడ్డిగా నమ్మిన ఓ అసత్య సమాచారం ఆయనను నిలువునా ముంచేసింది. 
లాటరీ రూపేణా భారీ మొత్తంలో నగదు చేజిక్కుతుందని ఆశపడి.. చివరికి చెంతనున్న సొమ్మును సైతం పోగొట్టుకున్న ఆయన.. నిలువునా మోసపోయానని ఆలస్యంగా గ్రహించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. విశాఖ సైబర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నగరానికి చెందిన బి.రామకృష్ణకు 2015లో వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌ నుంచి ఓ మెయిల్‌ వచ్చింది. అందులో ఆయన 250,000,000 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్స్‌ (భారత కరెన్సీలో రూ.2500 కోట్లు) గెలుచుకున్నట్లు ఉంది. విషయ నిర్ధరణకు ఆయన వచ్చిన మెయిల్‌కు బదులిచ్చారు. ఈ క్రమంలో ఫాస్టర్‌ న్యూమాన్‌ అనే వ్యక్తి +448726148738 నెంబరు నుంచి ఫోన్‌చేశాడు. హెచ్‌.ఎస్‌.బి.సి. బ్యాంక్‌ అధికారినని యూకే నుంచి మాట్లాడుతున్నానని నమ్మబలికాడు. ప్రైజ్‌మనీని యూకేలోని తమ బ్యాంకులో జమ చేశారని, వాటిని మీరు పొందటానికి యూకేలో బ్యాంక్‌ ఖాతా తెరవాల్సి ఉన్నందున కొంత సొమ్ము కట్టాలని చెప్పాడు. ఖాతా తెరిచాక ఎ.టి.ఎం.కార్డు పంపిస్తామని, దాన్ని ఉపయోగించి ప్రైజ్‌మనీని తీసుకోవచ్చని నమ్మించటంతో రామకృష్ణ రూ.34,500 నగదును డిపాజిట్‌ చేశారు. తర్వాత యూకే నుంచి ఎ.టి.ఎం.కార్డును పంపించారు. కార్డు పనిచేయాలంటే ప్రపంచ బ్యాంక్‌కు, యాంటీ టెర్రరిస్టు నిధుల సమీకరణకు, బీమాకంటూ పలుమార్లు నగదును జమ చేయించుకున్నారు. అప్పటికీ ఎ.టి.ఎం.కార్డు ద్వారా నగదు తీసుకునేందుకు వీలుకాకపోవడంతో రామకృష్ణ ఫాస్టర్‌ న్యూమాన్‌ను మళ్లీ సంప్రదించారు. ఈ క్రమంలో ప్రైజ్‌మనీని తమ ప్రతినిధి కెల్విన్‌ ఫిలిప్స్‌ అప్పగిస్తారంటూ అతన్ని రామకృష్ణ ఇంటికి పంపించాడు. అతగాడు వెంట తెచ్చిన బాక్సులోని కొంత బ్లాక్‌ కోటెడ్‌ కరెన్సీని ఒక ద్రవంలో ముంచి యూకే పౌండ్లుగా మార్చి చూపించాడు. రామకృష్ణను పూర్తిగా నమ్మించాడు. తెచ్చిన ద్రవం అయిపోయిందని, యూకే తిరిగివెళ్లాక దాన్ని కొరియర్‌లో పంపిస్తానని చెప్పటంతో రామకృష్ణ దఫదఫాలుగా వారికి రూ.70లక్షల వరకు ముట్టజెప్పారు. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు విశాఖ సైబర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. సి.ఐ. గోపినాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.