close

తాజా వార్తలు

ప్రధాని మోదీని ఇలా ఎప్పుడైనా చూశారా?

చిన్నపిల్లాడిలా మారిపోయి సందడి చేసి ప్రధాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రకృతి అంటే ఎంతిష్టమో తెలియంది కాదు. సహజ సిద్ధమైన వాతావరణాన్ని తిలకించడానికి ఆయన ఉత్తరాఖండ్‌కు, హిమాలయాలకు వెళ్లిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడు తొలిసారిగా ఆయన ఓ రియాల్టీ షోలో కనిపించనున్నారు. డిస్కవరీ ఛానల్‌ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ప్రోగ్రామ్‌లో ఈయన పాల్గొననున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, రచయిత బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఆయన ఈ షోలో పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో కోసం చిన్న వీడియోను షూట్‌ చేశారు. ఇందులో చూపించినట్లు మోదీ అతనితో కలిసి వన్యమృగాలుండే అడవిలో కలియ తిరిగారు. ఎన్నో సాహస కృత్యాలకు సన్నద్ధం అయ్యారు. గ్రిల్స్‌తో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి సందడి చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆగస్టు 12న దీనికి సంబంధించి పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.ఈ వీడియోను గ్రిల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.