
తాజా వార్తలు
విశాఖ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖ ఆంధ్రావిశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆదిమూలపు సురేశ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వర్సిటీకి వచ్చిన హరిచందన్‌ను అక్కడి అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి దేశ స్థితిగతులను మార్చుతుందన్నారు. దేశ విద్యా వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ఆంధ్రా యూనివర్సిటీ విశేష కృషి చేసిందనీ, భవిష్యత్‌లోనూ ఎన్నో విద్యా కుసుమాలను అందిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. నానాటికీ నీటి, వాయు కాలుష్యం పెరుగుతోందని..వాటిని తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి విశ్వ విద్యాలయాలు ప్రాధాన్యత నివ్వాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటు పడాలని కోరారు.
అనంతరం మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు వర్సిటీల నిధులను పక్కదారి పట్టించాయని ఆరోపించారు. దీనిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వర్సిటీల్లో విద్యార్థుల మౌలిక వసతులను మెరుగుపరుస్తామని, ఉపకులపతుల నియామకానికి కమిటీలు వేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- నీవు లేని జీవితం ఊహించలేను: రోహిత్
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
