close

తాజా వార్తలు

వానరాలకు వంతెనండోయ్‌..

ఒడిశాలోని సంబల్‌పూర్ మహానది వద్ద ఘటన

సంబల్‌పూర్‌: శ్రీరాముడు లంక చేరుకునేందుకు రామసేతు నిర్మాణంలో వానరాలు కీలక పాత్ర పోషించాయని పెద్దలు చెబుతుంటారు. అయితే  ఒడిశాలోని సంబల్‌పూర్‌ సమీపాన హుమా గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. హుమా గ్రామానికి ఆనుకొని మహానది మధ్యలో ఉన్న గుట్టపై కాళీమాత ఆలయం ఉంది. కొద్దిరోజుల క్రితం సుమారు 30 కోతులు అక్కడకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహానది ఉప్పొంగడంతో వానరాలన్నీ ఆ ప్రదేశంలో చిక్కుకుపోయాయి. ఆహారం దొరికే పరిస్థితులు లేవు. వీటిని గమనించిన గ్రామస్థులు నదిలోని బండరాళ్ళ మధ్యలో నాటుపడవలను నిలిపి కోతుల కోసం వంతెన మాదిరిగా ఏర్పాటు చేశారు. వాటిపైనుంచి ఒడ్డుకు చేరుకున్న మర్కటాలు బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.