close

తాజా వార్తలు

ప్రధాని మోదీ హుషారు చూసి ఆశ్చర్యమేసింది

మోదీపై బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసల జల్లు

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ టెలివిజన్‌ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ ఈ నెల 12న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్‌ మీడియాతో మాట్లాడారు.

‘ ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే ఆయన నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకుడి మాదిరిగా నాతో పాటు అడవిలో కలియతిరిగారు. ఆయన అంత హుషారుగా, సౌకర్యంగా, నిశ్శబ్దంగా ఉండటం చూసి నాకే ఆశ్చర్యమేసింది. ఈ షోలో భాగంగా మేం కొన్ని రాళ్లను నిజంగానే పగలగొట్టాం. మా బృందం మొత్తం అక్కడ ఉండటానికి భయపడుతుంటే మోదీ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఎలాంటి సంక్షోభాన్నైనా తట్టుకోగలరని నాకు అప్పుడే అర్థమైంది’ అని తెలిపారు. 

వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో దీన్ని షూటింగ్‌ జరిగింది.ఈ కార్యక్రమం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై ప్రసారం కానుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధిన ప్రోమోను బేర్‌ గ్రిల్‌ గత నెలలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి మంచి స్పందన లభించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.