close

తాజా వార్తలు

మా నియోజక వర్గానికి సాయం చేయండి

వయనాడ్‌: కేరళను వర్షాలు వణికిస్తున్నాయి. ప్రకృతి సోయగాలకు తలమానికమైన వయనాడ్‌ వర్షాల ధాటికి రూపు లేకుండా పోయింది. తరచుగా కొండ చరియలు విరిగి పడుతుంటడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆదివారం నుంచి అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు వయనాడ్‌ ప్రజలకు బాసటగా నిలవాలని రాహుల్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

‘నా పార్లమెంటరీ నియోజక వర్గం వరద గుప్పిట్లో చిక్కుకుంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వారికి కొన్ని నిత్యావసరాలు కావాలి. నీళ్లు, చాపలు, బ్లాంకెట్లు, దుస్తులు, బియ్యం, పప్పులు, కూరగాయలు, చిన్నపిల్లల ఆహారం వంటివి కావాలి. దాతలెవరైనా వీటిని అందించడానికి ముందుకు రావచ్చు. పైన పేర్కొన వాటిని మలప్పురంలోని కలెక్షన్‌ కేంద్రాలకు పంపించవచ్చు. ఎవరికైనా సందేహాలుంటే 854761 6003, 98472 58487 నంబర్లకు ఫోన్‌ చేయండి’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.