close

తాజా వార్తలు

పచ్చనైన అరణ్యం కంటే గొప్పదేముంది

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రసారం సందర్భంగా ప్రధాని మోదీ

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సాహసికుడు బేర్‌ గ్రిల్స్ కలిసి ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ ఈరోజు రాత్రి 9గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘పర్యావరణ పరిరక్షణ, వాతావరణం గురించి చెప్పడానికి ప్రకృతి తల్లి ఒడిలో ఉన్న పచ్చని అరణ్యాల కంటే గొప్పవి ఇంకేముంటాయి?. ఈ రాత్రి 9 గంటలకు ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ను వీక్షించండి’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రచారం కోసం గత నెలలో 45 సెకన్ల నిడివి ఉన్న వీడియోను బేర్‌ గ్రిల్స్‌ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. 

ఈ కార్యక్రమంలో తనకు ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ ఇటీవల ఓ మీడియాతో పంచుకున్నారు.‘ కొన్నేళ్లు నేను అడవులు, పర్వతాల్లో నివసించాను. ప్రకృతిని ఆస్వాదించాను. ఈ సమయం నా జీవితంపై చాలా ప్రభావం చూపింది. అందుకే రాజకీయ జీవితానికి సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమం చేయాలని నన్ను అడిగినప్పుడు వెంటనే అంగీకరించాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమం డిస్కవరీ ఛానల్‌ ద్వారా మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ నేషనల్ పార్క్‌లో దీన్ని చిత్రీకరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.