close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

 నేనున్నాననీ... మీకేంకాదని..!

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. సహాయక శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ‘వరదలు కేవలం వయనాడ్‌కు సంబందించినవే కాదు. కేరళ, కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. కర్ణాటక సైతం వరద ముంపును ఎదుర్కొటుంది. కేంద్రం తక్షణమే బాధిత రాష్ట్రాలకు సాయమందించాలి’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. దాతలు బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాల్సిందిగా పిలుపునిచ్చారు.

ముంపు తప్పింది..

మహారాష్ట్రలోని కరాడ్‌లో వరదలతో కృష్ణమాయి ఆలయం వద్ద పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న మున్సిపల్‌ కార్మికులు. గతవారంలో మహారాష్ట్రలో అతి భారీ వర్షాలకు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. పుణె, కొల్హాపూర్‌, సంగ్లీ, సతారా జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది

వరద ముంపులో కృష్ణమాయి ఆలయం (ఆగస్ట్‌ 9వ తేదీ చిత్రం)

ఎవరో ఆ ‘డ్రీమ్‌ గర్ల్‌’ ?

ముంబయి: ‘డ్రీమ్‌ గర్ల్‌’ ట్రైలర్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ భారుచా, ఏక్తా కపూర్‌. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ‘డ్రీమ్‌ గర్ల్‌’ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ భారుచా జంటగా నటించారు. ఈ చిత్రానికి శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలు.

హంపిలో వరుణుడు.. ఆగ్రాపై భానుడు

హంపిలో వరదనీటిలో నడుస్తున్న విదేశీ పర్యాటకులు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, కావేరి నదులు ఉప్పొంగుతున్నాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కర్ణాటకలో 17 జిల్లాలు ముంపులో ఉండడంతో పర్యాటక రంగం దెబ్బతింటోంది.

ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన మహిళలు ఎండ వేడిమికి స్కార్ఫ్‌ కప్పుకున్న దృశ్యం

ఇక కాషాయ ఫొగట్‌

 ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగట్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని హరియాణా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో బబిత, ఆమె తండ్రి మహవీర్‌ సింగ్‌ ఫొగట్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. 

కాసింత ఊరట

భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సోమవారం పర్యటించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో వరద ముంపులో చిక్కుకున్న మహిళకు సహాయక శిబిరంలో చికిత్స చేస్తున్న వైద్యురాలు. సాంగ్లీ, కొల్హాపూర్‌ జిల్లాలు గత వారం రోజులుగా వరద ముంపులో ఉన్నాయి. ముంబయి - బెంగళూరు నాలుగో నెంబరు జాతీయ రహదారి పూర్తిగా పాడవడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.