close

తాజా వార్తలు

యువశక్తిని అధిగమించేందుకు వినూత్నపద్ధతిలో..

జపాన్‌: మానవుడికి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చింది. అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమయ్యింది. పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో రోబోల వినియోగం విరివిగా సాగుతున్న ఈ రోజుల్లో  కొన్ని దేశాలు సాంకేతికతను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి.

క్రమంగా తగ్గుతున్న జనన రేటు.. పెరుగుతున్న వృద్ధుల జనాభాతో జపాన్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ దేశంలో యువత కొరతను అధిగమించేందకు  ఆ దేశం ఆవస్థపడుతోంది. సాంకేతికత వినియోగంలో అన్ని దేశాల కంటే ఒకడుగుముందే ఉండే జపాన్‌ దాని ఆసరాతోనే యువత కొరతను భర్తీచేసేందకు సేవారంగంలో విస్తృతంగా  రోబోలను వినియోగిస్తోంది. 

షిన్‌బాషి ప్రాంతంలో ఉండే  రోబోట్‌ బారిస్టా ఈ బారిస్టాలో రోబోవినియోగదారులకు రుచికరమైన కాఫీ క్షణాల్లో అందిస్తోంది. కాఫీ ప్రేమికులతో చిరునవ్వుతో మాట్లాడుతోంది, మర్యాదపూర్వకంగా వ్యవహారిస్తుంది. వినియోగదారులను ఆహ్లాదపరిచేందుకు నృత్యం చేస్తోంది. కాఫీ చేసిన తరువాత ఫిల్టర్లను శుభ్రం చేసి మళ్లీ కాఫీని సిద్ధం చేయడంలో నిమగ్నమవుతోంది. రోబో బారిస్టాలో కాఫీతో మరో ఆరు రకాల పానీయాలు లభిస్తాయి. రోబోట్‌ ఒకేసారి చాలా మందికి కాఫీని క్షణాల్లోనే అందివ్వగలదు. వినియోగదారుల వయసు ఆడ, మగ అన్న తేడాలను గుర్తించి ఈ రోబో కృత్రిమ మేథస్సుతో వారితో మర్యాదపూర్వకంగా వ్యవహారిస్తుంది. రోబో చేసిన కాఫీని తాగడం నూత్న అనుభూతునిస్తోందని వినియోగదారులు తెలిపారు. ఈ రోబోట్‌ బారిస్టాను కొద్దిగంటల్లోనే ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చని ఆ సంస్థ ఛైర్మన్‌ మసాహీరోఖానో చెప్పారు. వినియోగదారుల వ్యక్తీకరణ వారి కొనుగోలు చేసే పానీయాలపై వేగంగా స్పందించేలా రోబోట్‌ ను తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. వినియోగదారులకు వినోదం, రుచికరమైన కాఫీ అందించడమే లక్ష్యంగా రోబోను తయారుచేశామని మసాహీరో వెల్లడించారు. రాబోయే రెండుమూడేళ్లో 300 రోబోట్‌ బారిస్టా కేంద్రాలు ప్రారంభించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. మరికొన్నేళ్లలో త్వరలో కాస్త బర్గర్‌ వంటి వాటి తయారీలో కూడా రోబోట్‌లను వినియోగించాలని బావిస్తున్నట్లు తెలిపారు. 

లండన్‌లోని  బాయిబేకన్‌ ప్రాంతంలో రోబోటిక్‌ బారును ప్రారంభించారు. రెండు మిల్లీమీటర్ల ఖచ్చితమైన పానీయాన్ని రోబో మద్యం ప్రియులకు అందిస్తోంది. రోబో పైన అమర్చిన 150కిపైగా సీసాల నుంచి మద్యాన్ని సేకరించి దాన్ని సరిపాలలో కలిపి కాక్‌టెయిల్‌ మందుబాబులకు అందిస్తోంది. గంటకు 80మందికి ఈ రోబో మద్యం అందివ్వగలదు. వినియోగదారుల కోరుకున్నవిధంగా కాక్‌టెయిల్‌ను అందివ్వడం ఈ రోబో ప్రత్యేకతని నిర్వాహకులు తెలిపారు.


 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.