close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. 18 ఏళ్లలో తొలిసారి సెలవు

సాహసయాత్రకు వెళ్లడాన్ని సెలవు (వెకేషన్‌)గానే భావిస్తే.. 18 ఏళ్లలో తొలిసారి తాను ఈ సెలవు తీసుకున్నట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చూస్తేనే ఒళ్లు జలదరించే 250 రాయల్‌ బెంగాల్‌ పులులు సంచరించే ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ అభయారణ్యంలో బేర్‌గ్రిల్స్‌ అనే సాహసికుడితో కలిసి ఆయన చేసిన యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా నిలిచింది. తన జీవితయాత్రను ఆ సాహసయాత్రతో సమ్మిళితం చేసిన మోదీ.. యువతలో ప్రకృతిపట్ల ప్రేమ, సహజవనరుల సంరక్షణ బాధ్యత పెంపొందించే ప్రయత్నం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2.  విశాఖ హార్బర్‌లో ఏం జరిగింది? 

విశాఖ తీరానికి సమీపంలో నౌకాశ్రయ సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఎస్‌.పి.ఎం) వద్ద కోస్టల్‌ జాగ్వార్‌ అగ్ని ప్రమాదానికి గురవటం తీర భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. నౌకాశ్రయ అధికారులకు గుత్త సంస్థ కొమాకో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆఫ్‌షోర్‌ సపోర్ట్‌ వెసల్‌ కోస్టల్‌ జాగ్వార్‌ టగ్‌లో మొత్తం 20 మందే ఉండాలి. ప్రమాదం తరువాత అక్కడికి చేరుకున్న కోస్ట్‌గార్డ్‌ అధికారులు టగ్‌లో మొత్తం 30 మంది ఉన్నట్లు తేల్చారు. వారిలో ఒకరు చనిపోగా.. మరొకరు గల్లంతైనట్టు నిర్ధరించారు. నౌకాశ్రయ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నవారికంటే  ఎక్కువ మంది అక్కడ ఎందుకు ఉన్నారన్నది పెద్ద మిస్టరీగా మారింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. గాయత్రి నుంచి మధ్య మానేరుకు..

బాహుబలి పంపులు.. అత్యంత లోతైన భూగర్భ పంపుహౌస్‌, సర్జిపూల్‌తో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీ మరో అరుదైన ఘట్టానికి సిద్ధమైంది. రోజూ రెండు టీఎంసీల జలాలను 111.4 మీటర్లు ఎత్తిపోయగల పంపుహౌస్‌ (గాయత్రి) పూర్తిస్థాయిలో ప్రారంభానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం పలు దఫాలుగా ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టి పంపులను పరీక్షిస్తున్నారు. గాయత్రి పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరుకు నీటిని తరలించే ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు 14వ తేదీ బుధవారం శుభ ఘడియలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ఆమె చెయ్యే కారుకు తాళంచెవి! 

కారును స్టార్ట్‌ చేసేందుకు అవసరమైన ప్రత్యేక చిప్‌ను శరీరంలోకి చొప్పించుకోవడం ద్వారా అమెరికాలో ఓ మహిళ అందర్నీ నివ్వెరపరిచారు. ‘బయో హ్యాకింగ్‌’గా పిలుస్తున్న ఈ సాంకేతికత త్వరలో మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమీ డీడీ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆమెకు టెస్లా కంపెనీకి చెందిన మోడల్‌-3 కారు ఉంది. దాన్ని స్టార్ట్‌ చేసేలా తన చేతినే తాళంచెవిగా మార్చుకోవాలని అమీ భావించారు. కారు వాలెట్‌ కార్డు నుంచి ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డు (ఆర్‌ఎఫ్‌ఐడీ)’ చిప్‌ను జాగ్రత్తగా వేరుచేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికా-తాలిబన్‌ చర్చలు పూర్తి

అఫ్గానిస్థాన్‌లో అమెరికా తన బలగాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ఒప్పందానికి సంబంధించి తాలిబన్‌-అమెరికా ప్రతినిధుల మధ్య తాజా చర్చలు ముగిసినట్లు ఇరువర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని 14,000 మంది సైన్యాన్ని పెంటగాన్‌ ఉపసంహరించే ఈ ఒప్పందంపై ఇరు వర్గాలు ఏడాదిగా దోహాలో చర్చలు జరుపుతున్నాయి.

6. 16 నుంచి పరుగులు తీయనున్న ఉదయ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఉత్కృష్ట డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రి’ (ఉదయ్‌) ఎక్సప్రెస్‌ రైలు విశాఖ-విజయవాడ మధ్య ఈ నెల 16 నుంచి పరుగులు తీయనున్నట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు వాల్తేర్‌ యార్డులో ఉన్న ఈ రైలును పట్టాలపైకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక రేక్‌ (కొన్ని బోగీలు) విశాఖ నుంచి చెన్నై వెళ్లడంతో ఆ మార్గంలో ట్రయల్‌ రన్‌ పూర్తయినట్లు భావించిన అధికారులు..ఈ నెల 13న విశాఖ-విజయనగరం మధ్య ప్రయోగాత్మక పరుగు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. తెదేపా విస్తృతస్థాయి సమావేశం నేడు

తెదేపా విస్తృతస్థాయి సమావేశం మంగళవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరుగుతుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు సమావేశానికి హాజరవుతారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలపై దాడులు, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం, 70 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ రద్దు

ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రైబ్యునల్‌ (ఏపీఏటీ)కి కాలం చెల్లనుంది. ఏపీఏటీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం తమకు పరిపాలన ట్రైబ్యునల్‌ అవసరం లేదని మూడేళ్ల క్రితమే స్పష్టంచేసింది. దరిమిలా ఏపీఏటీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లవుతున్నా హైదరాబాద్‌ కేంద్రంగానే అది పనిచేస్తోంది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. నేటి నుంచి బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారుల విధులు 

తెలంగాణ తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే)భవన్‌లో మంగళవారం నుంచి ఉన్నతాధికారుల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించనున్నారు. మరోవైపు సిబ్బంది రాకకు మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. దస్త్రాలు, ఫర్నిచర్‌ పూర్తిస్థాయిలో చేరిన తర్వాతే ఉద్యోగుల కార్యకలాపాలు మొదలుకానున్నాయి. మరోవైపు సచివాలయం తరలింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. ఇంటర్వ్యూలు ఆ ఆరుగురికే.. 

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ ఎంపికకు రంగం సిద్ధమవుతోంది. ఈ శుక్రవారమే ఈ పదవి కోసం ఇంటర్వ్యూలు చేపట్టనుంది కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ. ఇందుకోసం ఆరుగురితో తుది జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవనున్నారట. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.