close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి ముద్రగడ లేఖ

కాపులకు రిజర్వేషన్లపై అంశంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2017లో తెదేపా ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కోటా కేటాయించిందని, దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉప్పొంగిన కృష్ణమ్మ

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. జలాశయాలన్నింటినీ నింపుకుంటూ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలకళను సంతరించుకున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా నాగార్జునసాగర్‌ గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మరో రెండురోజుల పాటు వరద కొనసాగే అవకాశముంది. మరోవైపు పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెదేపా నేతల మూడు ఇళ్లు కూల్చివేత

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనార్దన్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం నుంచి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నేతలు అంటున్నారు. తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గడ్కరీకి తప్పిన ముప్పు

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి టేకాఫ్‌ చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన 6ఈ 636 విమానం నేడు నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం ఉన్నట్లు టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు పైలట్‌ గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్‌ నటి జాన్వి కపూర్‌ 

6. కశ్మీర్‌ ప్రజల గళాన్ని వినాల్సిందే: మన్మోహన్‌

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. ఈ తరుణంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అండ కొరవడిందని అంగీకరించిన పాక్‌!

కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్‌ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ అంశంలో భారత్‌పై పాక్‌ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం ఆఫర్‌కు ట్రంప్‌ గుడ్‌బై

కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనంటూ ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన భారత్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ఆఫర్‌ ఇకపై ఎప్పుడూ చర్చకు రాదని ట్రంప్‌ స్పష్టం చేసినట్లు అమెరికాకు భారత రాయబారి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌!

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ గాట్టింగ్‌ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్‌ ఆంటీ డోపింగ్‌ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సెల్‌ కొట్టేసిన కొండముచ్చు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.