close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. జగన్‌-కేసీఆర్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారు

ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌- కేసీఆర్‌ ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచిస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గోటితో పోయేది..గొడ్డలిదాకా తెచ్చారు: పవన్‌

తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. మలికిపురం ఘటనలో గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అవినీతికి ఆస్కారంలేని ఇసుక విధానం: జగన్‌

‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో 90 శాతం పరిష్కారమవుతున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఇసుక కొరత ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చెప్పారు. అవినీతికి ఆస్కారం లేని ఇసుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు: దత్తాత్రేయ

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెరాస ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు

6. కశ్మీర్‌పై కేంద్రానికి సమయం ఇద్దాం: సుప్రీం

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు స్వీకరించింది. మరికొద్ది రోజుల్లో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అటార్నీ జనరల్‌ ధర్మాసనానికి వివరించారు. అటార్నీ జనరల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పంజా విసురుకున్న పులులు

8. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని చెంగం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ పారిశ్రామిక వేత్త సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను బెంగళూరుకు చెందిన కోరమంగళ గ్రానైట్‌ యజమాని శ్రీనాథరెడ్డి, అతని కుటుంబసభ్యులుగా గుర్తించారు. ప్రమాదంలో శ్రీనాథరెడ్డితో పాటు భార్య, కుమారుడు, అల్లుడితో పాటు మరో వ్యక్తి మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భాజపా గూటికి 10 మంది ఎమ్మెల్యేలు

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక్కరోజులోనే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎలాగంటారా.. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నుంచి 10 ఎమ్మెల్యేలు నేడు ఒకేసారి భాజపాలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు దిగజారి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా విలువ కోల్పోయాయి. మరోపక్క హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ 10శాతానికి పైగా లాభపడ్డా మార్కెట్‌ పతనాన్ని ఆపలేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.