close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

ప్రియాంక పరామర్శ

ఉత్తర్‌ప్రదేశ్‌ సోంభద్ర జిల్లాలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం పర్యటించారు. గత నెలలో జిల్లాలోని ఉబ్బా గ్రామంలో ఊరి పెద్ద, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పదిమంది మృతి చెందారు. 36 ఎకరాల భూమి విషయంలో రైతులు, గ్రామపెద్దకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వెళ్తుండగా గ్రామపెద్దను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామపెద్ద అతని అనుచరులతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక సోంభద్ర వెళ్లారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని కలిసేందుకు మరోసారి వస్తానని ఉబ్బా గ్రామస్థులకు ప్రియాంక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

వృక్షానికి రక్షాబంధన్‌

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభసూచకంగా జరుపుకునే పండుగ 'రక్షాబంధన్'‌. దీనికి మరో అర్థం చెబుతున్నారు విశాఖలోని ప్రకృతి ప్రేమికులు. విశాఖ రైల్వే స్టేషన్‌ యార్డులో 132 ఏళ్లనాటి మర్రి చెట్టుకు ప్రకృతి ప్రేమికులు రాఖీలు కట్టారు. జీవితాంతం తమకు రక్షణ కల్పించమని సోదర భావానికి ప్రతీకగా రాఖీ కడతారు. చెట్టు-మనిషి మధ్య ఉండాల్సింది అటువంటి సంబంధమే అని చాటిచెప్పారు.

జాతివైరం మరచి!

హైదరాబాద్‌: ఆహారం కోసం ఎదురుచూస్తున్న గద్ద ఇందిరాపార్క్‌లోని ఓ కొబ్బరి చెట్టుపై వాలేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గద్ద కాళ్లు కొబ్బరి కొమ్మలో ఇరుక్కుపోయాయి. దీంతో తల్లకిందులుగా వేలాడుతూ అరవసాగింది. అదే చెట్టుపై ఉన్న కాకుల జంట దీనిని గమనించాయి. అందులోని ఓ కాకి గద్ద కాళ్లలో ఇరుక్కున్న కొబ్బరి కొమ్మపై వాలింది. రెండు మూడు సార్లు కొమ్మను బలంగా లాగేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. 

చేద్దాం మన వంతు సాయం

దిల్లీ: దేశంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటూ వెళ్లలేని స్థితిలో సాయం కోసం వేచి చూస్తున్నారు. పలు చోట్ల వరద ధాటికి మొసళ్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరదల కారణంగా కేరళ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల్లో 200మందికి పైగా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ట్విటర్‌ ద్వారా ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. వరద బాధితులకు సాయం చేయాలంటూ పూరీ తీరంలో ఇలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు

ఈ సారి ఎవరో కరోడ్‌పతి?

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఈ కార్యక్రమం తెలియని టీవీ ప్రేక్షకులు అరుదు. 2008లో ప్రారంభమైన టీవీ షోలో విజేతకు కోటి రూపాయల వరకు బహుమతి అందజేస్తారు. మంగళవారం ముంబైలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 11వ సీజన్‌ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ పాల్గొన్నారు. ఆగస్టు 19 నుంచి కార్యక్రమం టీవీలో ప్రసారం కానుంది. 

వందేమాతరం ఇది మీ నవతరం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని అలహాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు రూపొందించిన సైకత శిల్పం

జమ్ము: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రిహర్సల్స్‌ చేస్తున్న విద్యార్థినులు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.