close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన

పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.  పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణ నా రక్తం, గుండెల్లో ఉంది: పవన్‌

ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు నుంచి వస్తాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మహానటి లాంటి సినిమాలు ఎంతో మందికి ప్రేరణ కలిగించాయనీ.. ఇంకా చాలా మంచి సినిమాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అంటే ఎంతో ఇష్టమన్నారు. తెలంగాణ తన రక్తం, గుండెల్లో ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి : రాహుల్‌

జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు రావాలన్న గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్వాగతించారు. అయితే అందుకు విమానం పంపాల్సిన అవసరం లేదన్నారు. తనతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, ప్రజలు, సైనికులను కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాహుల్‌ గవర్నర్‌ను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆ ఓవర్‌త్రోపై సెప్టెంబర్‌లో సమీక్ష

ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఏ క్రీడాభిమానీ మర్చిపోలేడు. ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో కివీస్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన త్రో బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బంతి బౌండరీ చేరిన విషయం యావత్‌ క్రీడాలోకానికి తెలిసిందే. ఈ వివాదాస్పద ఓవర్‌త్రోపై సెప్టెంబర్‌లో సమీక్ష జరుపుతామని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బెయిల్‌పై విడుదలైన జనసేన ఎమ్మెల్యే రాపాక 

తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు బెయిల్‌ మంజూరైంది. తాజాగా ఆయన స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరుల దాడి చేశారంటూ కేసు నమోదు కావడంతో ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో రాపాక పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హీరో నాగశౌర్యకు జరిమానా విధించిన పోలీసులు

7. స్టార్టప్‌లకు ఉపశమనం..!

స్టార్టప్‌లకు ఆదాయపు పన్ను శాఖ కొంత ఉపశమనం కల్పించింది. మరికొన్ని సంస్థలకు ఏంజెల్‌ పన్ను నుంచి ఉపశమనం కల్పించేలా మినహాయింపును ఇచ్చింది. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌లు కొన్ని నిబంధనల కింద ఈ మినహాయింపులు ఇచ్చాయి. దీని ప్రకారం ఫిబ్రవరి 19 కంటే ముందే అడిషనల్‌ అసెస్‌మెంట్‌ పూర్తి చేసుకొన్న సంస్థలకు మినహాయింపును ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వీటికి కూడా మినహాయింపులు ఇచ్చేందుకు అంగీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మూడు చెట్లు నరికి..రూ.39వేల జరిమానా కట్టి..

అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గూగుల్‌ టాప్‌ లిస్ట్‌లో మళ్లీ ఈ బ్యూటీనే!

గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీల జాబితాలో మరోసారి నటి సన్నీ లియోనీ టాప్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. 2019లో గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన భారతీయ సెలబ్రిటీల్లో ప్రధాని మోదీ, సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లను దాటి ఆ స్థానాన్ని సన్నీ లియోనీ అధిగమించారు. గతేడాది కూడా ఈమే టాప్‌ స్థానంలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ద్రవిడ్‌కు ఊరట! పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు క్లియర్‌

టీమిండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసును క్రికెట్‌ పాలకుల కమిటీ మంగళవారం క్లియర్‌ చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) క్రికెట్‌ హెడ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ కోర్టులో ఉందని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొగ్డె అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.