Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141962
            [news_title_telugu_html] => 

వానర పోరు.. స్థానికుల హోరు..!

[news_title_telugu] => వానర పోరు.. స్థానికుల హోరు..! [news_title_english] => A group of monkeys clash [news_short_description] => రెండు వర్గాలు ఎదురెదురుగా మోహరించాయి. ఒకరిపైఒకరు దొరికితే చావగొట్టాలన్న కసితో రగిలిపోతున్నాయి. కేకలు వేసుకుంటూ ఎగిరెగిరిపడుతున్నాయి. [news_tags_keywords] => monkey, fighting, anthapuram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => oSpOQa5MCck [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:20:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వానర పోరు.. స్థానికుల హోరు..! - A group of monkeys clash - EENADU
close

తాజా వార్తలు

వానర పోరు.. స్థానికుల హోరు..!

కళ్యాణదుర్గం: రెండు వర్గాలు ఎదురెదురుగా మోహరించాయి.  ఇరు వర్గాలు కసితో రగిలిపోతున్నాయి. కేకలు వేసుకుంటూ ఎగిరెగిరిపడుతున్నాయి. అయితే ఇదేదో పాత కక్షల నేపథ్యంలో జరిగే గొడవ కాదు స్థానికులకు వినోదం పంచిన రెండు వానర గుంపుల మధ్య జరిగిన పోరు.. గొడవ ఎక్కడ మొదలయ్యిందో ఏ వర్గం ముందు కవ్వించిందో తెలియదు కానీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని రహదారులపై రెండు వానరాల గుంపులు కలహానికి దిగాయి. రోడ్డుకి ఇరువైపులా మోహరించి పరస్పరం తలపడ్డాయి. వీటి ఊకరింపులతో అలజడి సృష్టించాయి. ఒక వర్గం వానరాలు రహదారి డివైడర్‌పై మోహరిస్తే మరో వర్గం ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు నుంచి పోరాటం సాగించింది. దాదాపు అరగంటసేపు పరస్పరం ఈ గుంపుల మధ్య కీచులాట సాగింది. వాటి హడావడికి ట్రాఫిక్‌ కాసేపు నిలిచిపోయింది. స్థానికులు సైతం ఎక్కడివారు అక్కడే వాటి మధ్య జరిగే పోరును చూస్తూ నిలబడిపోయారు.  మూగ జీవాలైనా వాటికి అభిప్రాయ భేదాలుంటాయనే విషయం ఈ సంఘటనే నిదర్శనం. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.