
తాజా వార్తలు
దిల్లీ: దేశ వ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ చేరుకున్న ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి త్రివిధ దళాలు గౌరవవందనం సమర్పించాయి.ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారని, వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. ‘‘ ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. అందులో భాగంగానే ఆర్టికల్ 370,35ఏ రద్దు చేశాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను నెరవేర్చాం. వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పని చేసేలా ముందుకెళ్తున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ అన్నారు. వైద్యారోగ్య రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ‘‘ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు వరం వంటిది. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తేవాలన్నదే మా లక్ష్యం. వచ్చే ఐదేళ్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. రెండో సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యాంగ స్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం,. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నామని, అడ్డంకులు అధిగమించి ముందుకు సాగుతున్నామని తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
