Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143008
            [news_title_telugu_html] => 

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌

[news_title_telugu] => ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌ [news_title_english] => EX MP Vinod Kumar Appointed as State Planning Commission Vice President [news_short_description] => తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తెరాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. .. [news_tags_keywords] => Vinod Kumar,TRS,Ts News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:26:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌ - EX MP Vinod Kumar Appointed as State Planning Commission Vice President - EENADU
close

తాజా వార్తలు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తెరాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినోద్‌ కుమార్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాజకీయ, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్‌ సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతను కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్ కుమార్‌కు సీఎం అప్పగించారు. ఈ నియామకం పట్ల వినోద్‌ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.