Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143371
            [news_title_telugu_html] => 

ఫోన్లు పనిచేస్తాయి.. బడులు తెరుచుకుంటాయ్‌

[news_title_telugu] => ఫోన్లు పనిచేస్తాయి.. బడులు తెరుచుకుంటాయ్‌ [news_title_english] => Mobiles work..School opens [news_short_description] => జమ్మూ-కశ్మీర్‌లో ఆంక్షల్ని దశలవారీగా, పద్ధతి ప్రకారం తొలగిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. కశ్మీర్‌ ప్రాంతంలో చాలా వరకు ఫోన్‌లైన్లన్నీ వారాంతంలో [news_tags_keywords] => JammuKashmir,Schools,Mobiles [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 08:53:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఫోన్లు పనిచేస్తాయి.. బడులు తెరుచుకుంటాయ్‌ - Mobiles work..School opens - EENADU
close

తాజా వార్తలు

ఫోన్లు పనిచేస్తాయి.. బడులు తెరుచుకుంటాయ్‌

జమ్మూ-కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి వెల్లడి

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఆంక్షల్ని దశలవారీగా, పద్ధతి ప్రకారం తొలగిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. కశ్మీర్‌ ప్రాంతంలో చాలా వరకు ఫోన్‌లైన్లన్నీ వారాంతంలో ప్రారంభమవుతాయని, సోమవారం నుంచి ప్రాంతాల వారీగా బడులూ తెరుచుకుంటాయని, విద్యార్థుల చదువులకు ఇబ్బందులు రాబోవని తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  టెలికం సేవలను దశలవారీగా శుక్రవారం రాత్రి నుంచి పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రజల కదలికలపై ఆంక్షల్ని ప్రాంతాలవారీగా తొలగిస్తున్నామని, సదరు ప్రాంతాల్లో ప్రజారవాణా కూడా మొదలవుతోందని చెప్పారు. ముందస్తు నిర్బంధాలకు సంబంధించి పరిస్థితిని సమీక్షించాక తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

* పరిస్థితులను చక్కదిద్దేందుకు కశ్మీర్‌ లోయలో 11 రోజులపాటు గడిపిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ శుక్రవారం దిల్లీ వెళ్లిపోయారు. ఆగస్టు 6న శ్రీనగర్‌ చేరుకున్న డోభాల్‌ భద్రత, అభివృద్ధి సంబంధ కార్యకలాపాల బాధ్యతను తీసుకున్నారు. ప్రాణనష్టం నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదేం వ్యాజ్యం?: సుప్రీంకోర్టు
దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370 అధికరణం రద్దుపై దాఖలు చేసిన వ్యాజ్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ మరుసటి రోజునే న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని అరగంట సేపు చదివినా విషయం అర్థం కాలేదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘‘ఇదేమి వ్యాజ్యం? ఇదే అంశంపై వచ్చిన మరో 5వ్యాజ్యాల్లోనూ లోపాలు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని మీరు కోరలేదు. ఏమి కోరుతున్నారో స్పష్టత లేదు. సాంకేతిక కారణాలతో దీన్ని తిరస్కరించవచ్చు. ఇంత ప్రాధాన్యం ఉన్న అంశంపై లోపాలతో వ్యాజ్యాలు వేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ ఆరు వ్యాజ్యాల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టం చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.