Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143378
            [news_title_telugu_html] => 

త్వరలో రాయదుర్గం వరకు మెట్రో

[news_title_telugu] => త్వరలో రాయదుర్గం వరకు మెట్రో [news_title_english] => Metro to Rayadurgam soon [news_short_description] => హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్తు తీగల వ్యవస్థ (ఓఈటీఎస్‌)ను చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ డీవీఎస్‌ రాజు శుక్రవారం పరీక్షించారు. యూసుఫ్‌గూడలోని [news_tags_keywords] => Metro,Rayadurgam,Hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 09:07:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
త్వరలో రాయదుర్గం వరకు మెట్రో - Metro to Rayadurgam soon - EENADU
close

తాజా వార్తలు

త్వరలో రాయదుర్గం వరకు మెట్రో

పూర్తయిన విద్యుత్తు తనిఖీలు

ఈనాడు, హైదరాబాద్‌: హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్తు తీగల వ్యవస్థ (ఓఈటీఎస్‌)ను చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ డీవీఎస్‌ రాజు శుక్రవారం పరీక్షించారు. యూసుఫ్‌గూడలోని 132/25కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి ట్రాక్షన్‌ లైన్‌కు సరఫరా అందుతుంది. తనిఖీలు పూర్తికావడంతో కిలోమీటర్‌ పైగా ఉన్న ఈ మార్గంలో త్వరలోనే ప్రయోగాత్మక పరుగులు మొదలు కానున్నాయి. తనిఖీల అనంతరం ఆయన మాట్లాడుతూ .. ఓఈటీఎస్‌కు విద్యుత్తు సరఫరా ద్వారా, హైటెక్‌ సిటీ స్టేషన్‌ తర్వాత రివర్సల్‌లో వెళ్లడం, రావడం పరీక్షలు చేయడం సాధ్యమైందన్నారు. రివర్సల్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చాక అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మధ్య రద్దీవేళల్లో ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చన్నారు. ఇది కారిడార్‌-3లో కీలకమని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి పేర్కొన్నారు. 
రూ.5వేల కోట్లు అంచనా.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాక రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో పనులు ప్రారంభిస్తామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.  31 కిలోమీటర్ల దూరానికి రూ.5వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు రెండునెలల్లో పనులు పూర్తి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.