Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143401
            [news_title_telugu_html] => 

ముంచెత్తిన కృష్ణమ్మ.. ఆందోళనలో బాధితులు

[news_title_telugu] => ముంచెత్తిన కృష్ణమ్మ.. ఆందోళనలో బాధితులు [news_title_english] => Heavy water flow to Prakasam Barrage [news_short_description] => కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వస్తున్న వరదతో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. తారకరామనగర్‌, [news_tags_keywords] => Prakasam Barrage, Krishna [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 10:50:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ముంచెత్తిన కృష్ణమ్మ.. ఆందోళనలో బాధితులు - Heavy water flow to Prakasam Barrage - EENADU
close

తాజా వార్తలు

ముంచెత్తిన కృష్ణమ్మ.. ఆందోళనలో బాధితులు

విజయవాడ: కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వస్తున్న వరదతో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. తారకరామనగర్‌, భూపేష్‌గుప్తానగర్‌, గీతానగర్‌లో ఇంటిపైకప్పులను తాకే స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. కృష్ణలంకలో కొన్ని కుటుంబాలు కట్టుబట్టలతో జాగారం చేస్తున్నాయి. మూడు రోజులుగా వరద చుట్టుముట్టడంతో  జనం బయటకు రాలేకపోతున్నారు.

మరో రెండు రోజులు వరద కొనసాగే అవకాశముందన్న అంచనాతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలోని నది పరీవాహక గ్రామాల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మరోవైపు చెవిటికల్లులోని కృష్ణానది వరద నీటిలో గల్లంతైన బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నీట మునిగిన 278 ఇళ్లు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలాన్ని వరద నీరు చుట్టుముట్టింది. కొక్కిలిగడ్డ హరిజనవాడలో 278 ఇళ్లు నీటమునిగిపోయాయి. బొబ్బర్లంకలో నివాస గృహాలు నీటమునిగాయి. అయినప్పటికీ పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ప్రజలు ఎత్తైన డాబాల మీదకు చేరుకున్నారు. ఎడ్లలంక గ్రామాన్ని కూడా కృష్ణ వరద ముంచెత్తింది. కరకట్టకు లోపల ఉన్న గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పులిగడ్డ శివారు పల్లెపాలెం, రేగుల్లంక, దక్షిణ చిరువోలు లంక గ్రామాలు జలదిగ్భందమయ్యాయి.

నదిలో చిక్కుకున్న ఐదుగురు
కృష్ణా జిల్లా నదిమధ్యలోని లచ్చిగానిలంకలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చల్లపల్లి మండలం ఆముదార్లంకకు చెందిన వీరి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 20 గేదెలు, 2 జతల ఎడ్ల కోసం నిన్న ఉదయం వారంతా పడవలో వెళ్లారు. నిన్న రాత్రి 10గంటల తర్వాత వారి నుంచి సమాచారం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో చిక్కుకున్న వారికోసం గ్రామస్థులు పడవలో వెళ్తున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అరవింద వారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. వేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు వదిలి వచ్చేందుకు అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను మాత్రం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్‌ స్తంబాలు నీట ముగిన కారణంగా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. 

అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెద్దమద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ-అమరావతి మధ్య నాలుగో రోజు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు వద్ద నక్కవాగు ప్రవాహంతో క్రోసూరు- అచ్చంపేట మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. అమరావతి అమరేశ్వరాలయం పార్కింగ్ ప్రదేశానికి, ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మించే ప్రదేశానికి వరద నీరు వచ్చి చేరింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.