Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143426
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్ - 1PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ - 1PM
            [news_title_english] => one pm news
            [news_short_description] => 
            [news_tags_keywords] => top10,news,1pm
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-17 12:59:28
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్ - 1PM - one pm news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1PM

1. చంద్రబాబు ఇంటికి నోటీసులు

కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కరకట్ట వెంటఉన్న భవనాలకు స్థానిక తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ఇళ్లలో ఉండొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో కరకట్ట ప్రాంతంలోనే అద్దెకు ఉంటున్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అంటించారు. తాడేపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పేరుతో చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కృష్ణా ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు అనిల్‌కుమార్‌, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పర్యటిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతం కృష్ణలంక రక్షణ గోడవద్ద వరద పరిస్థితిని సమీక్షించారు. రెండు మూడు రోజుల్లో వరద సాధారణ పరిస్థితికి వస్తుందని మంత్రి అనిల్‌ కుమార్‌ అన్నారు. అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. యాదాద్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలిస్తారు. తుదిదశకు చేరుకుంటున్న ఆలయ నిర్మాణాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వాగులో బాలిక గల్లంతు..మృతదేహం లభ్యం

కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద వాగులో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన తులసి ప్రియ అనే బాలిక మృతి చెందింది. నిన్నటి నుంచి ఆమె కోసం గాలించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల్ని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు ఓదార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కశ్మీర్‌పై బయటి జోక్యం అవసరం లేదు

జమ్మూ-కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత అంశమని భారత్‌ పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ఎటువంటి బయటి జోక్యం అవసరం లేదని  తెగేసి చెప్పింది. ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే పాక్‌తో చర్చలుంటాయని తేల్చి చెప్పింది. కశ్మీర్‌పై శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో రహస్య సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో భారత్‌ మరోసారి తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజానికి గట్టిగా వినిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పాక్‌కు ట్రంప్‌ మరో షాక్‌

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాకిచ్చింది. ఆ దేశానికిచ్చే ఆర్థిక సాయంలో 440 మిలియన్‌ డాలర్ల కోత విధించింది. పాక్‌కు ఇస్తామన్న దాంట్లో ఇక 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్థిక సాయం చేస్తామని ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్‌కు ట్రంప్‌ తాజా నిర్ణయంతో గట్టి షాక్ తగిలినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. యూరోప్‌ అతిపెద్ద థియేటర్‌లో సాహో

యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాహో ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ప్యారిస్‌ నగరంలోని ప్రఖ్యాత థియేటర్‌గా పేరుపొందిన ‘ది గ్రాండ్‌ రెక్స్‌’లో ప్రదర్శనకు సాహో ఎంపికయ్యింది. యూరోప్‌లోనే అతిపెద్ద థియేటర్‌గా పేరుపొందిన ‘ది గ్రాండ్‌ రెక్స్‌’లో ఒకేసారి 2800 మంది కూర్చొవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఎమ్మెల్యే ఇంట్లో ఏకే-47

బిహార్‌లో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకే 47 తుపాకీ లభ్యమవడం కలకలం రేకెత్తించింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మొకామా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనంత్‌కుమార్‌ ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపారు. అక్రమ ఆయుధాలు భద్రపరచారన్న సమాచారంతో జరిపిన ఈ సోదాల్లో అనూహ్యంగా ఏకే 47తో పాటు భారీగా బుల్లెట్లు, పేలుడు పదార్ధాలు దొరకడం విస్మయానికి గురి చేసింది. దీనిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం లాంటి పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. రవిశాస్త్రి ఎంపికపై అభిమానుల ఆగ్రహం

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి కోచ్‌గా అతడినే ఎంపిక చేయాల్సి వస్తే ఇక మిగతావారిని ఇంటర్వ్యూలకు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీకి ఏది నచ్చితే అదే చెల్లుబాటవుతుందని అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అమెరికాలో తెలుగువారి స్వాతంత్ర్య వేడుకలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.